గ్రేట్ ఎస్కేప్: బాలుడిపైనుంచి కారు పోనిచ్చిన యువతి(వీడియో)
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ బాలుడు పెను ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఓ యువతి నిర్లక్ష్యంగా కారును సదరు బాలుడుపైనుంచి తీసుకెళ్లింది. అయినా, అతడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
మంగళవారం రాత్రి చిన్నారులందరూ ఓ గల్లీలో ఫుట్‌బాల్ ఆడుతోన్న సమయంలో ఓ బాలుడు షు లేస్ కట్టుకుంటూ కారు పక్కనే రోడ్డుపై కూర్చున్నాడు. అదే సమయంలో కారు ఎక్కిన యువతి ముందు చూసుకోకుండానే కారును బాలుడి మీదకు పోనిచ్చింది.
వెంటనే అప్రమత్తమైన బాలుడు కారు మధ్య భాగంలో పడుకుని ఉండిపోయాడు. స్వల్ప గాయాలపాలైన బాలుడు కారు మీద నుంచి వెళ్లిన తర్వాత లేచి ఏడుస్తూ బాలుడు స్నేహితుల దగ్గరకు పరుగులు తీశాడు. కాగా, ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నిర్లక్ష్యంగా కారుడు నడిపిన యువతిపై నెటిజన్లు మండిపడుతున్నారు.













Click it and Unblock the Notifications