• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాజీ మిస్ ఇండియా యూనివర్స్‌కు తప్పని వేధింపులు : కారు ఆపి, డ్రైవర్‌ను కొట్టి .. (వీడియో)

|

కోల్‌కతా : ఆకతాయిల హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. గల్లీలో ఉండే అమ్మాయిలను వదలని కేటుగాళ్లు .. ఇక అందగత్తెలు కనిపిస్తే అంతే సంగతి. తమలో ఉన్న పైశాచికాన్ని లేపి మరీ ఏడిపిస్తుంటారు. వారిపై కనీసం జాలి, దయ, కరుణ చూపరు. వేధించడమే తమ నైజం అన్నట్టు ప్రవర్తిస్తారు. నిన్న కోల్‌కతాలో మాజీ మిస్ ఇండియా యూనివర్స్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

డ్రైవర్‌పై దాడి ..

ఉసోసి శెన్ గుప్తా 2010 మిస్ ఇండియా యూనివర్స్. తాను కోల్‌కతాలోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్తుంది. ఇంతలో కొందరు ఆకతాయిలు క్యాబ్ వెంటపడ్డారు. తమ క్యాబ్‌ను ఢీ కొని .. తనను, తన కోలిగ్, డ్రైవర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆమె ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు.

Miss India Universe Ushoshi Sengupta pens Kolkata horror: 6 boys dragged me, beat up Uber driver

ఏం జరిగిందంటే ..

సోమవారం రాత్రి 11.40 గంటలకు జేడ్యూ మారయిట్ హోటల్‌లో తమ విధులు ముగించుకొని బయటకొచ్చారు మాజీ మిస్ ఇండియా యూనివర్స్ శెన్ గుప్తా. ఆమె మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. అయితే రాత్రిళ్లు కూడా విధులు చేయాల్సి రావడంతో నిన్న రాత్రి పని పూర్తయ్యాక బయటకొచ్చారు. తనతోపాటు కొలిగ్ కూడా ఉన్నారు. ఇంతలో కొందరు ఆకతాయిలు బైక్‌ల మీద వచ్చారని పేర్కొన్నారు. వారికి కనీసం హెల్మెట్ కూడా లేదని శెన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ వాహనం నిలిపివేసి .. డ్రైవర్‌పై తిట్ల దండకం ప్రారంభించారని తెలిపారు. అంతేకాదు కారును కదుపుతూ .. డ్రైవర్‌ను బయటకు లాగారని పేర్కొన్నారు. డ్రైవర్ చెప్పేది కూడా వినకుండా దాదాపు 15 మంది కలిసి దాడిచేశారని వివరించారు. అయితే తాను ధైర్యం చేసి కారు డోర్ తీసి బయటకొచ్చానని .. వీడియో తీయడం ప్రారంభించానని తెలిపారు. వెంటనే ప్రాథమిక సాక్ష్యంగా వీడియోను చూపించి మైదాన్ పోలీసు స్టేషన్ వద్దకు పరుగెత్తితే అది మా పోలీసు స్టేషన్ పరిధిలోకి రాదని చెప్పారని నిట్టూర్చారు. అక్కడ డ్రైవర్‌ను చావ కొడుతున్నారని చెపితే పోలీసులు వచ్చారని ... వారిని చూసి అల్లరిమూకలు పారిపోయారని తెలిపారు. అక్కడినుంచి వెళ్లాక కూడా ఆ అల్లరిమూకలు తమను ఫాలో అయ్యారని పేర్కొన్నారు. తర్వాత కూడా కారును ఆపే యత్నం చేశారని ఆపకపోవడంతో రాళ్లతో దాడిచేశారని గుర్తుచేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
miss India Universe 2010 Ushoshi Sengupta took an Uber from a five-star hotel in Kolkata on Monday night. Little did she know that the ride would turn out to be a horrific experience for her and her colleague. The former Miss India Universe took to Facebook to write a detailed post on what she had to face last night when a group of boys rammed into her cab and harassed her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more