ఆరేళ్ల చిన్నారి .. నిర్జీవంగా స్నేహితుడి ఇంట్లో ... అతనిపైనే అనుమానం
లక్నో : ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో అసలే తెలియదు. కానీ ఆ చిన్నారి మాత్రం విగతజీవిగా పడి ఉంది. తన తండ్రి కోలింగ్ ఇంట్లో నిర్జీవంగా కనిపించింది. ఆ చిన్నారి కనిపించకుండా పోయిన కొన్ని గంటల్లోనే ఆచూకీ దొరికింది. కానీ అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది .. ఆమెను తల్లిదండ్రులు బతికించుకోలేకపోయారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధానిలో జరిగిన హృదయ విదారకర ఘటన ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది.
లక్నోలో ఓ ఫ్యామిలీ నివసిస్తోంది. అతనికి భార్య, ఆరేళ్ల కూతురు ఉంది. అతను పనిచేసే చోట మరో సహోద్యోగి కూడా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ అభం శుభం తెలియని పాప ప్రాణాలమీదికి వచ్చింది. నిన్న సాయంత్రం పాప కనిపించకుండా పోయింది. వెంటనే తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. కొద్దిసేపటికే ఆమె ఆచూకీ లభించింది. పాప తండ్రి కోలిగ్ ఇంట్లో కనిపించింది.

కానీ నిర్జీవంగా పడి ఉండటంతో వారు గుండెలు బాదుకున్నారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి గొంతుపై కోసి ఉండటం, అప్పటికే రక్తం పోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దగ్గరలోని ట్రామా సెంటర్‌లో చేర్చిన ఫలితం లేకపోయింది. ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
తన కూతురు మృతికి కారణం పాప తండ్రి సహోద్యోగి అని ఆరోపిస్తున్నారు. అతని ఇంట్లోనే నిర్జీవంగా కనిపించినందున కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సహోద్యోగి పాత్రపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications