వీడు తండ్రేనా?: పాలు తాగనందుకు అలాంటి శిక్షా? పాపం.. ఆ చిన్నారి ఏమైందో..
డల్లాస్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి పాలు తాగనందుకు ఓ మూర్ఖపు తండ్రి ఊహించని శిక్ష విధించాడు. దీంతో ఆ చిన్నారి కనిపించకుండా పోయింది.
టెక్సాస్ : డల్లాస్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి పాలు తాగనందుకు ఓ మూర్ఖపు తండ్రి ఊహించని శిక్ష విధించాడు. దీంతో ఆ చిన్నారి కనిపించకుండా పోయింది.
వెస్లీ మాథ్యూస్(37) కుటుంబం భారత సంతతికి చెందిన ఓ పాపను దత్తత తీసుకుంది. ఆ చిన్నారి పేరు షెరిన్, వయసు మూడేళ్లు. శనివారం రాత్రి కుమార్తె షెరిన్ పాలు తాగకపోవడంతో మాథ్యూస్ కు కోపం వచ్చింది.

దీంతో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతడు తన కూతుర్ని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాడు. ఇంటికి దూరంగా ఓ చెట్టు కనిపించడంతో షెరిన్ ను అక్కడికి తీసుకెళ్లి, తెల్లవారే వరకూ అక్కడే నిలబడమని ఆదేశించి తిరిగి ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.
ఓ పావుగంట తరువాత చూస్తే... ఆ చెట్ట దగ్గర షెరిన్ కనిపించలేదు. దీంతో ఆ చిన్నారి కోసం చుట్టుపక్కల చాలాసేపు వెతికారుగానీ ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
జరిగినదంతా తెలుసుకున్న పోలీసులు చిన్నారి అదృశ్యానికి కారణమైన మాథ్యూస్ అరెస్టు చేసి, అనంతరం ఓ బాండ్‌పై విడుదల చేశారు. ఈ ఘటనపై స్పందించేందుకు మాథ్యూస్ నిరాకరించాడు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications