పవన్ హన్స్ హెలికాప్టర్ కూలిపోయింది

న్యూఢిల్లీ: వారం క్రితం అసోం నుండి బయలుదేరి తరువాత ఆచూకి గల్లంతు అయిన పవన్ హన్స్ హెలికాప్టర్ కూలిపోయిందని అధికారికంగా వెల్లడించారు. ఆ పవన్ హన్స్ హెలికాప్టర్ శకలాలను గుర్తించామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జూ స్పష్టం చేశారు.

ఈ నెల 4వ తేదిన అసోంలోని డిబ్రుగడ్ నుండి పవన్ హన్స్ హెలికాప్టర్ బయలుదేరి వెళ్లింది. తరువాత హెలికాప్టర్ ఆచూకి గల్లంతు అయ్యింది, హిమాచల్ ప్రదేశ్ లో చివరి సారి సిగ్నల్స్ వచ్చాయని అధికారులు గుర్తించారు.

Missing Pawan Hans Helicopter Found in Arunachal Pradesh

అప్పటి నుంచి హెలికాప్టర్ కోసం గాలిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తిరాప్ జిల్లా ప్రధాన కేంద్రం అయిన దక్షిణ ఖోన్నా ప్రాంతానికి 12 కిలో మీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలు గుర్తించామని ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఐఏఎస్ అధికారి కమలేష్ జోషితో పాటు మరొ ముగ్గురు మరణించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జూ స్పష్టం చేశారు. అయితే ప్రమాధానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+