బెంగళూరు బంద్ తుస్, ఓరి పిచ్చోడా, ఎవరైనా ఫ్రీ అంటే వద్దంటాడా ?, లాజిక్ !
బెంగళూరు: కర్ణాటకలో తాము విజయం సాధిస్తే ఐదు ఉచిత హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు ఉచిత హామీల అమలుకు చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీల పథకాలు బీజేపీ కొంప ముంచిన విషయం తెలిసిందే.
కర్ణాటకలో శక్తి పథకం అమలు తర్వాత ప్రభుత్వంతో పోరాడుతున్న ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు ఇప్పుడు తమ డిమాండ్ల సాధన కోసం సిద్దరామయ్య ప్రభుత్వం మీద బంద్ అస్త్రాన్ని ప్రయోగించారు. సోమవారం బెంగళూరు బంద్ కు వివిద సంఘాలు, ప్రైవేట్ వాహనాలు అసోసియేషన్లు పిలుపునిచ్చాయి.

ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ల బంద్ నేపథ్యంలో బెంగళూరు నగరంలో సుమారు మూడు లక్షలకు పైగా ఆటోలు, 1.50 లక్షల ట్యాక్సీలు, 20 వేల గూడ్స్ వాహనాలు, ఐదు వేలకు పైగా ప్రైవేట్ స్కూల్ బస్సులు, వ్యాన్ లు, 80 వేల సిటీ ట్యాక్సీలు, కార్పొరేట్ కంపెనీల బస్సులు నిలిపివేసి బంద్ కు పిలుపునిచ్చాచి. అయితే సోమవారం ఉదయం నుంచి ఇందులో సుమారు 70 శాతం మంది మాత్రమే బంద్ కు మద్దతు తెలిపారని సమాచారం.
తమ డిమాండ్‌లు ప్రభుత్వం ముందు ఉంచిన యూనియన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ వాహనాల సర్వీసులను పూర్తిగా నిలిపివేసి బంద్ నిర్వహిస్తున్నారు. పలు యూనియన్ లు ప్రభుత్వంతో పాటు బెంగళూరు ప్రజలకు షాక్ ఇచ్చింది.

శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత నష్టపోతున్నామని విలపిస్తున్న ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ పలు డిమాండ్లు పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే యూనియన్లు ఇచ్చిన గడువులోగా ప్రభుత్వం వీరి డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ నిరసన వ్యక్తం చేసింది. ఈ బంద్‌కు 30కి పైగా ప్రైవేట్ సంస్థలు మద్దతు ఇచ్చాయి. సోమవారం బంద్ జరిగే సమయంలో కోన్ని సంస్థలు బంద్ లో పాల్గొనకుండా చేతులు ఎత్తేశాయని తెలిసింది.
కర్ణాటకలోని వివిద జిల్లాలకు చెందిన ప్రైవేట్ బస్సుల, గూడ్స్ వాహనాల యాజమాన్యం, సిబ్బంది బెంగళూరులోని 7 ప్రధాన రహదారుల నుంచి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వారిని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రవేట్ వాహనాలు నిలిచిపోయినా బెంగళూరు నగరంలో మెట్రో రైళ్ల సంచారం, బీఎంటీసీ, ఓల్వో, కేఎస్ఆర్ టీసీ బస్సులు, అంబులెన్స్ లు సంచారం యదావిధిగా కోనసాగుతోంది.
ఇదే సమయంలో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఎప్పటిలాగే వ్యాపారలావాదేవీలు సజవుగా సాగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరులో అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరులో పలు ప్రైవేట్ స్కూల్స్ కు సోమవారం సెలవు ప్రకటించారు. బెంగళూలో దాదాపు అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి.

బెంగళూరులో సోమవారం మద్యాహ్నం వరకు ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, మదనపల్లె, తమిళనాడులోని క్రిష్ణగిరి, హోసూరు, ధర్మపురి, సేలం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రైవేటు బస్సులు లేక నానా ఇబ్బందులు పడ్డుతున్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications