మిజోరం: మహిళలకు రిజర్వేషన్లు సహ కీలక హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కీలక హామీలతో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఔత్సాహిక క్రీడాకారులకు స్కాలర్‌షిప్‌లతో పాటు మిజోరం స్పోర్ట్స్ అకాడమీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిజోరం అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ 'విజన్ డాక్యుమెంట్'(మేనిఫెస్టో)ను శుక్రవారం విడుదల చేశారు. ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ మిజోరం ఒలింపిక్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

చాలా రాజకీయ పార్టీలు అమలు చేయలేని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. అయితే, బీజేపీ మాత్రం అమలు చేసే హామీలతోనే మేనిఫెస్టో లేదా విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిందన్నారు. ఆర్థిక వనరులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని పరిశోధనలు చేసిన తర్వాతనే బీజేపీ తన విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిందని తెలిపారు.

Mizoram polls 2023: BJP Releases Manifesto, Promises 33% Reservation For Women In Govt Jobs

'మేము రిపోర్ట్ కార్డ్ రాజకీయాలను నమ్ముతాము, ప్రధాని మోడీ దేశ రాజకీయ సంస్కృతిని మార్చారు. మొదట్లో, ప్రజలు మతం, కులం, మతం, ప్రాంతం రాంతం ఆధారంగా ఎన్నికల్లో పోరాడేవారు. ఓటు బ్యాంకు రాజకీయం ఉండేది, మనం 'ఓటు బ్యాంకు రాజకీయాలు' అని పిలుస్తాము. కానీ ప్రధాని మోడీ వచ్చాక.. రాజకీయాల నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనం పనితీరు, జవాబుదారీ రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు, ప్రతి ప్రాంతం, ప్రతి కులం, ప్రతి మతాన్ని అభివృద్ధి చేసే రాజకీయాలు. లింగ వివక్ష ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదు, ప్రాంతీయ వివక్ష ఉండకూడదు. అలా మేము పనిచేశాము. ముందుకు వెళ్తున్నాం' అని పేర్కొన్నారు నడ్డా.

సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం అమలులో జరిగిన అన్ని అవకతవకలు, అవినీతిపై దర్యాప్తు చేయడానికి బీజేపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని నడ్డా చెప్పారు. "దీర్ఘకాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి, ప్రయోజనాలు, హక్కులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వంతో సహకరిస్తాము'' అని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

గతంలో భారత్‌ను బలహీన ఆర్థిక వ్యవస్థగా పరిగణించేవారని నడ్డా అన్నారు. "ఈ రోజు, అత్యుత్తమ ఆర్థిక నాయకులు కూడా భారతదేశం మాత్రమే ప్రకాశవంతమైన ప్రదేశం అని అభిప్రాయపడ్డారు. ఇది స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూరప్ వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలతో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశం స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఐఎంఎఫ్ చెబుతోంది.ఇదంతా గత 9 ఏళ్లలో జరిగింది' అని జేపీ నడ్డా వివరించారు. కాగా, మిజోరంలో నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+