స్టాలిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం: కారు ధ్వంసం
చెన్నై: డీఎంకే నేత ఎమ్‌కే స్టాలిన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు కారులో చెన్నై నుంచి ధర్మపురికి వెళ్తుండగా వెల్లూరు సమీపంలో కారు ప్రమాదానికి గురైంది.

పల్లికొండ టోల్‌గేట్ వద్ద కారు ఆగివున్న సమయంలో వెనక నుంచి మరో కారు ఓవర్‌టేక్ చేయబోయి స్టాలిన్ కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

కాన్వాయ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ని మరో వాహనంలో ఎక్కించారు. ఈ ప్రమాదంలో స్టాలిన్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతన్నారు.












Click it and Unblock the Notifications