ఆసక్తికరం: ముఖ్యమంత్రికి దారిచ్చిన స్టాలిన్, ప్రశంసలు
శాసనసభకు వెళుతున్న ప్రతిపక్షనేత స్టాలిన్ తన కారు వెనుక సీఎం కాన్వాయ్ రావటాన్ని గుర్తించి దారి ఇచ్చారు.
చెన్నై: తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర అంశంగా మారింది. శాసనసభకు వెళుతున్న ప్రతిపక్షనేత స్టాలిన్ తన కారు వెనుక సీఎం కాన్వాయ్ రావటాన్ని గుర్తించి దారి ఇచ్చారు. ఈ విషయం సోసల్ మీడియాకు ఎక్కడంతో స్టాలిన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శాసనసభ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం తన నివాసం నుంచి కారులో ప్రతిపక్షనేత స్టాలిన్ బయలుదేరారు. ఆయన కారు వెంట సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బంది, శాసనసభ్యుల వాహనాలు కూడా వస్తున్నాయి. ఆ సమయంలో ఆళ్వారుపేట దాటిన తర్వాత ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం కాన్వాయ్ రావటాన్ని స్టాలిన్ గుర్తించారు.

వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన నిలపాల్సిందిగా డ్రైవరుకు సూచించారు. అలాగే భద్రతా సిబ్బంది, శాసనసభ్యులకు ఆ విషయాన్ని చేరవేశారు. దీంతో క్షణాల్లో వారి కార్లన్నీ రోడ్డు పక్కకు చేరుకుని నిలిచిపోయాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లిపోయింది.
ఆ తర్వాత స్టాలిన్, శాసనసభ్యుల కార్లు అక్కడి నుంచి ముందుకు కదిలాయి. ప్రతిపక్షనేతగా క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న స్టాలిన్ ఇలా ముఖ్యమంత్రిని గౌరవిస్తూ ఆయన కాన్వాయ్‌కు దారిచ్చిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications