వర్మ హాట్ ఎమ్మెల్యే కామెంట్స్ పై.. : అంగూర్ లతా రియాక్షన్

అసోం : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల స్పందించారు అసోం మహిళా ఎమ్మెల్యే అంగూర్ లతా డేకా. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. అసోంలోని భతద్రోబ నియోజకవర్గం నుంచి అంగూర్ లతా గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యేగా అంగూర్ లతా గెలుపుపై సోషల్ మీడియాలో స్పందించిన వర్మ, ఇంత 'అందమైన ఎమ్మెల్యేలు రాజకీయాల్లోకి వస్తున్నారంటే అచ్చే దిన్ వచ్చేసినట్టే' అని కామెంట్ చేశారు. అంతేకాదు 'ఎమ్మెల్యే అంగూర్ లతాను చూస్తోంటే తొలిసారిగా తనకు రాజకీయాలపై ప్రేమ పుడుతోందని, ఇందుకు ప్రధానికి మోడీకి, అంగూర్ లతాకి థ్యాంక్స్' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

కాగా, వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కామెంట్స్ తో పాటు అంగూర్ లతా హాట్ ఫోటోస్ కూడా ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే అంగూర్ లతా వర్మ కామెంట్స్ ను తాను పట్టించుకోవట్లేదని స్పష్టం చేశారు.

mla angoor lata reaction over varma hot comments

ఎమ్మెల్యే అంగూర్ లతా దీనిపై స్పందిస్తూ.. 'నేను రామ్ గోపాల్ వర్మ గురించి పట్టించుకోను. తన కామెంట్స్ తన ఇష్టం. ఆయన కామెంట్స్ ని ఆలోచనలను నేను పట్టించుకోను. అన్నింటికి మించి అసోం ప్రజలకు నేనంటే ఏంటో తెలుసు. వర్మ సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను పంచుకోవడం మంచి విషయమే' అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే అంగూర్ లతాపై తన కామెంట్స్ పాజిటివ్ కోణంలో చేసినవేనని వివరణ ఇచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అంగూర్ లతాకు తాను జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+