కమలనాథ్‌కు షూలేస్ కట్టి విమర్శలపాలైన ఎమ్మెల్యే

మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ఛీఫ్ మాజీ కేంద్రమంత్రి కమలనాథ్‌కు తన బూట్ల లేసును కట్టి విమర్శల పాలయ్యాడు ఆ పార్టీ ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కమలనాథ్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రజ్నీష్ సింగ్ అంతటి స్వామిభక్తిని ప్రదర్శించడం అవసరమా అంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత ఊర్మిళా సింగ్‌కు నివాళులు అర్పించేందుకు కమలనాథ్ వచ్చారు. నివాళులు అర్పించాకా ఆయన షూ లేస్‌ను రజ్నీష్ సింగ్ కట్టడం పలువురిని షాక్‌కు గురిచేసింది. అయితే కమలనాథ్ లాంటి సీనియర్ నేతపై గౌరవం ఉన్నందునే ఆయన బూటు లేసును కట్టినట్లు ఇందులో తనకు తప్పేమి అనిపించలేదని రజ్నీష్ సింగ్ చెప్పారు. కమల్ నాథ్ తనకు తండ్రిలాంటి వారని ఆపై కవరింగ్ ఇచ్చారు. తను స్కూలులో చదివే రోజుల నుంచే తన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునే వాడినని గుర్తు చేశారు.

MLA ties shoe lace to Kamalnath,trolled

ఈ దృశ్యాన్ని మీడియా వక్రీకరించి ప్రచారం చేసిందని మండిపడ్డారు. దీనిపై చర్చ మానేయాలని... ఆ గదిలో చాలామంది ఉన్నందున కమల్ నాథ్ బూట్లు కనిపించకపోవడంతో అవి వెతికి తన పాదాల దగ్గర ఉంచినట్లు రజ్నీష్ సింగ్ వివరించారు.దీన్నే మీడియా బూతద్దంలో పెట్టి తప్పుగా చూపిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+