ఎంఎన్‌సీ ఉద్యోగి అనుమానాస్పద మృతి: వేర్వేరు గదుల్లో భార్య,తల్లి..
న్యూఢిల్లీ: ఓ ఎమ్మెన్సీ కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. అతను సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ప్లాటినమ్ హైట్స్ అపార్టుమెంటులో గల తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతుడిని 32 ఏళ్ల అమిత్ బచ్చన్‌గా గుర్తించారు. అతని తల్లి, భార్య శివానీలు ఇంటిలోని వేర్వేరు గదులలో బంధించబడి కనిపించారు. వారి ఇద్దరికి గాయాలయ్యాయి. అమిత్ బచ్చన్, శివానీలకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది.

మృతుడు మెడ చుట్టూ టీవీ కేబుల్ వైర్ గుర్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం ఏడు గంటల సమయానికి సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. మృతుడి భార్య, తల్లికి గాయాలైనప్పటికీ వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.
వారి స్టేట్‌మెంటును పోలీసులు రికార్డ్ చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. హత్య లేదా ఆత్మహత్య కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. అమిత్ బచ్చన్ తన తల్లి, భార్యల పైన దాడికి పాల్పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. భార్య, తల్లి వేర్వేరు గదల్లో ఉండటం, అతను మరో గదిలో ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications