లోక్ సభ ఎన్నికలకు మేము రెఢీ, ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యం: హీరో కమల్ హాసన్!
చెన్నై: లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రముఖ బహుబాష నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో మా పార్టీ నాయకులు పోటీ చేస్తారని కమల్ హాసన్ చెప్పారు.
తమిళనాడులోని మధురైలో మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సన్నాహాలు మొదలు పెట్టామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ తన సత్తా చాటుకుంటుందని కమల్ హాసన్ జోస్యం చెప్పారు.

తమిళనాడులో జరిగే శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సిద్దంగా లేదని, ఆ ఉద్దేశం మాకు లేదని కమల్ హాసన్ ఇదే సందర్బంలో స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి, అన్నాడీఎంకే నాయకుడు ఏకే. బోస్ మరణించడంతో రెండు నియోజక వర్గాలు ఖాళీ అయ్యాయి.
తిరువారూర్, తిరుపనకుండ్రమ్ శాసన సభ నియోజక వర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమీషన్ ఇంకా ప్రకటించలేదు. శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications