బ్యాంకు దోపిడీ: దొరికిన దొంగ చేయి నరికేశారు
పాట్నా: బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ దొంగ పారిపోయే క్రమంలో స్థానికులకు చిక్కాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అతని చేయి నరికేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని మహువా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం... సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్‌లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ. 1.70 లక్షలు దోచుకొని పారిపోతున్న క్రమంలో.. నలుగురిలో జితేందర్ కుమార్ అనే దొంగ గ్రామస్తులకు దొరికిపోయాడు.
పారిపోతున్న సమయంలో దుండగులు తమపై కాల్పులకు తెగపడ్డారనే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు జితేందర్ కుమార్‌ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్‌ను కాపాడి ఆస్పత్రికి తరలించారు.

ఈవ్‌టీజర్‌కి బుద్ధిచెప్పిన మహిళా న్యాయవాది
ఈవ్‌టీజింగ్‌కి పాల్పడిన యువకుడికి దేహశుద్ధి చేసిన ఓ మహిళా న్యాయవాది.. అతడ్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా న్యాయవాది బస్సులో మీరట్ వెళ్తుండగా.. ఆజ్ మహ్మద్ అనే యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో ఆగ్రహించిన ఆమె అతడికి అక్కడే దేహశుద్ధి చేసి.. అనంతరం పోలీసులకు అప్పగించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications