రేప్ చేయబోయాడు: కారులో నుంచి దూకిన మోడల్
భోపాల్: తనను ప్రేమించడం లేదనే కారణంతో ఓ మోడల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమెపై అత్యాచారానికి ఓడిగట్టాడు ఆమె మాజీ బాయ్‌ప్రెండ్. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం....
సోమవారం అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి కారులో పనిమీద బయటకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా ముగ్గురు యవకులు వచ్చి ఆమెతో గొడపడ్డారు. ఆ తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి వేరే కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో కిడ్నార్లకు తనకు పెనులాగ జరిగిందని బాధితురాలు పేర్కొంది. కారులోకి ఎక్కకపోతే మొహంపై యాసిడ్ పోస్తామంటూ బెదిరించారని కూడా తెలిపింది. అలా ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కొంత దూరం వెళ్లే సరికే ఆమె కారులో నుంచి దూకేసింది.

తనతో పెనుగులాడిన నిందితులను కూడా బాధితురాలు గుర్తించింది. ఈ కిడ్నాప్ ఉదంతానికి తన మాజీ ప్రియుడు అమీర్ కారణమని బాధితురాలు పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తన మాజీ ప్రియుడికి ఏనాడు కూడా తనా హాని చేయలేదని, తనపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారో తెలియడం లేదని బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. భోపాల్‌లో ఈ ఘటన కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications