మాజీ మోడల్ ప్రియాంకకు, స్నేహితురాలికి మధ్య బంధం ఏమిటి?

మీరట్: తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేసిన మాజీ మోడల్ ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పోలీసులు వెల్లడించారు. తన స్నేహితురాలు అంజుతో కలిసి ప్రియాంక తల్లిదండ్రులను కూరగాయలు తరిమే కత్తితో అతి దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

తల్లిదండ్రులను చంపినందుకు మీరట్ కోర్టు ప్రియాంకతో పాటు, తన స్నేహితురాలకి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే.. యువతి ఒక్కతే హత్యకు పథకం పన్నడం సాధ్యం అయ్యే పని కాదని, ఓ సాధారణ స్నేహితురాలు మరో స్నేహితురాలికి హత్యకు సహకరించే పరిస్థితి ఉండదని పోలీసులు చెప్తున్నారు. వారి మధ్య బలమైన బంధం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని వారంటున్నారు.

ఆ బలమైన బంధమే వారిద్దరి మధ్య ఉన్న లెస్బియన్ బంధం కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు కూడా వారిద్దరు లెస్బియన్లు అంటున్నారు. ఆస్తి వివాదాలు, తన పట్ల వివక్ష చూపడం వల్ల ప్రియాంక అంజూకు దగ్గరయింది. అది వారిద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారి తీసిందని అంచనా.

Model Priyanka Singh may have relation with friend

2008 నవంబరు 10న తన మార్కు షీటు తీసుకోవడానికి మీరట్‌లోని ప్రయాగ్ కాలనీలోని తన తల్లిదండ్రుల ఇంటికి స్నేహితురాలు అంజూతో కలిసి ప్రియాంక వెళ్ళింది. తన తల్లితో జరిగిన వాగ్వాదంతో క్షణికావేశానికి లోనైన ప్రియాంక వంటగది కత్తితో తల్లిని పొడిచి చంపింది. చప్పుడు విని పడక గది నుంచి బయటకు వచ్చిన తండ్రిని కూడా అదే కత్తితో స్నేహితులిద్దరూ దారుణంగా పొడిచి హతమార్చారు.

కత్తిని మురికి కాల్వలో పడేసి విలువైన సాక్ష్యధారాలతో ఇరువురు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత అంజుతో ప్రియాంక తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నదని, తన కంటే నాలుగేళ్ళ చిన్నవాడైన అంజూ సోదరుడు అజేంద్రను ఆమె వివాహం చేసుకుందని ప్రియాంక బంధువులు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+