పోర్న్ డివిడి బిజినెస్ చేస్తున్న నటి తండ్రి: అరెస్టు
ముంబై: పోర్న్ సిడి - డివిడి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణపై మోడల్ - యాక్టర్ మిస్తీ ముఖర్జీ తండ్రిని, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని ఓషివారాలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో వారిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు 2 లక్షల రూపాయల విలువ చేసే సిడీలను, 25 లక్షల రూపాయల విలువ చేసే డివీడిలను స్వాధీనం చేసుకున్నారు.

ఫ్లాట్‌లో నిందితులు డివిడీలను తయారు చేసి మార్కెట్లో ఉమ్మతున్నారని పోలీసులు చెప్పారు. ఇందులో మిస్తీ ప్రమేయం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చంద్రకాంత్ ముఖర్జీ (60), సామ్రాట్ ముఖర్జీ (35)లను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
అవసరమైతే ఫ్లాట్ యజమాని ఓపి గుప్తాను పిలుస్తామని పోలీసులు చెప్పారు. ఓపి గుప్తా బెస్ట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గుప్తా కుటుంబంపై ఫిర్యాదులు లేవని, జరిగింది దురదృష్టకరమైన సంఘటన అని బెస్ట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంతకు ముందు ఈ ఫ్లాట్‌లో ఉక్రెయిన్ మోడల్స్ ఉండేవారని చెబుతున్నారు. వారికి ఇమిగ్రేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు.












Click it and Unblock the Notifications