డ్యాన్సర్‌పై గ్యాంగ్ రేప్: నలుగురి అరెస్టు (ఫొటోలు)
హైదరాబాద్: ముంబై డ్యాన్సర్‌పై జరిగిన అత్యాచార కేసులో హైదరాబాద్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఈవెంట్ మేనేజర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎస్‌కు బదిలీ అయింది. బాధితురాలి ఫిర్యాదుతో మహారాష్ట్రలోని వర్సోవా పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ సంఘటన మాత్రం ఆ స్టేషన్ పరిధిలో జరగలేదు. హైదరాబాదులోని గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో నేరం జరిగినట్లు గుర్తించారు.
కేసులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు, సంఘటన జరిగిన ప్రాంతాన్ని గుర్తించేందుకు వర్సోవా పోలీసులు బాధితురాలిని తీసుకుని ముంబై నుంచి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన లేఖపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ఆమోదముద్ర వేశారు.
డ్యాన్సర్‌ను ముంబై నుంచి హైదరాబాద్ రప్పించిన వారిలో ముగ్గుర్ని పోలీసులు గుర్తించారు. నేరం పటాన్‌చెరు, లేకపోతే హయత్‌నగర్ ప్రాంతాల్లో జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముంబై పోలీసులతో పాటు మహిళా సీసీఎస్‌కు చెందిన మహిళా పోలీసులు బాధితురాలిని ప్రత్యేక వాహనంలో విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఏయే మార్గాల్లో నిందితులు తిప్పారో తెలుసుకున్నారు.
అత్యాచారం జరిగిన ప్రదేశం కనుక నగర పరిధిలో లేకపోతే మళ్లీ కేసును సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేయాల్సి వస్తుంది. కేసు సీసీఎస్‌లో నమోదైనందున శంషాబాద్ పోలీసులు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నారు. బాధితురాలు ప్రస్తుతం సీసీఎస్‌లోని మహిళా పోలీసుల పర్యవేక్షణలో ఉంది. పోలీసులు రూపొందించిన వ్యూహం ఫలిస్తే రెండు, మూడు రోజుల్లోనే కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముంబై డ్యాన్సర్ కేసు
అత్యాచారానికి గురైన ముంబై డ్యాన్సర్‌కు పోలీసులు రక్షిత అని పేరు పెట్టారు. కేసు ముంబై నుంచి హైదరాబాదుకు బదిలీ అయింది. దీంతో శుక్రవారం ఆమెను హైదరాబాదు తీసుకని వచ్చారు.

ముంబై డ్యాన్సర్ కేసు
ముంబై డ్యాన్సర్‌ను హైదరాబాదు తీసుకుని వచ్చి శుక్రవారం పోలీసులు విచారించారు. నేరం జరిగిన స్థలాన్ని గుర్తించడానికి సిసిఎస్ పోలీసులు ప్రయత్నించారు.

ముంబై డ్యాన్సర్ కేసు
ముంబై డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం కేసులో హైదరాబాదు పోలీసులు దూకుడు పెంచారు. కేసును రెండు మూడు రోజుల్లో కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముంబై డ్యాన్సర్ కేసు
ముంబై డ్యాన్సర్ కమ్ మోడల్‌పై సామూహిక అత్యాచారం కేసు ముంబై నుంచి హైదరాబాదుకు బదిలీ కావడంతో సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications