మోడళ్లకు కోర్టులో ‘ఆడిషన్స్’ నిర్వహించిన దావూద్ అనుచరుడు
ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ముస్తాఫా దొస్సా ముంబై కోర్టు ఆవరణలోనే మోడల్స్‌కు ఆడిషన్ టెస్టులు నిర్వహించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే చూస్తుంటాం.
కానీ, కోర్టు ఆవరణలో ఈ రకం సంఘటన చోటుచేసుకోవడం పలు విమర్శలకు దారి తీసింది.
పలుకేసుల్లో కోర్టుకు హాజరవుతున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన దొస్సా.. దుబాయ్‌లోని ఓ జ్యువెల్లరీ షాప్ వాణిజ్య ప్రకటన కోసం ఎనిమిది మంది మోడల్స్‌ను ముంబైలోని స్థానిక కోర్టులో ఇంటర్వ్యూ చేశాడు.
వారిలో ముగ్గుర్ని ఎంపిక చేయడంతో అతని అనుచరుడు సయ్యద్ లక్ష రూపాయల నగదును అడ్వాన్సుగా ముట్టజెప్పాడు. అక్కడి నుంచి ఓ మోడల్ తిరిగి వెళ్తుండగా నగదుతోపాటు మొబైల్ ఫోన్‌ను దొస్సా అనుచరులు లూటీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బాధిత యువతి శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పి తన వద్ద ఉన్న ఫోన్, లక్ష రూపాయలను తీసుకెళ్లారని, క్రైం బ్రాంచ్‌కు వచ్చి తీసుకొమ్మన్నారని తెలిపింది. అయితే తాను అక్కడికి వెళ్లి అడిగితే.. తమ పోలీసులెవరూ అలాంటి పని చేయలేదని చెప్పారని తెలిపింది.
అయితే దొస్సా అనుచరులే ఈ పని చేసివుంటారని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. కాగా, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ మోహన్ దహికర్ తెలిపారు. మాఫియా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications