అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం: భారతీయ సంప్రదాయాలకు నిలువుటద్దం
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ మహోత్సవం.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం పట్టింది. అచ్చంగా భారతీయ వివాహ పద్ధతులకు అనుగుణంగా ఆ ఇద్దరు దంపతులు పెళ్లిపీటలు ఎక్కారు.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్.. తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూలై 12వ తేదీన వారిద్దరూ ఒక్కటయ్యారు. ముంబై వేదికగా మొత్తం ఆరు రోజుల పాటు సాగిన ఈ వివాహ వేడుక.. మనం తుచ తప్పకుండా పాటించే విలువలు, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పింది.

ఓ పెళ్లిలో పురోహితులు.. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారో.. వాటన్నింటినీ పాటించింది అంబానీ కుటుంబం. వివాహం జరిగి ఏడాది పూర్తి అయినప్పటికీ.. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే.. దానికి కారణం- ఆరు రోజుల పాటు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ రాధిక మర్చంట్ మెడలో అనంత్ అంబానీ.. మూడు ముళ్లు వేయడమే.
భారతీయ విలువలు, మంత్రాలు, సంప్రదాయాలతో కూడిన ఈ వివాహం జరిగింది. గత ఏడాది జూన్ 29వ తేదీన అంటిలియా నివాసంలో విఘ్ననాయకుడు గణేషుడి పూజతో పెళ్లి వేడుకలు ఆరంభం అయ్యాయి. ఇది భక్తికి, సంప్రదాయాల పట్ల అంబానీ కుటుంబానికి ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలిచింది.
ఆ తర్వాత హల్దీ, మెహందీ, సంగీత్, గర్బా నైట్ వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇవన్నీ భారతీయ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయి వున్నవే. జూలై 12వ తేదీన జరిగిన వివాహ వేడుకలో వేద మంత్రోచ్ఛారణలు, పవిత్ర అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు, శాస్త్రీయ ప్రదర్శనలు భారతీయ వివాహ వేడుకల శాశ్వతమైన సౌందర్యాన్ని కళ్ళముందుంచాయి.
పెళ్లి మంటపం అలంకరణను- ఆలయ వాస్తుశిల్పం, జానపద కళారూపాలు, పౌరాణిక ప్రతీకల నుండి తీసుకున్నారు. వధూవరుల దుస్తులు భారతీయ హస్తకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి. పెళ్లి రోజున రాధిక ఎరుపు-తెలుపు రంగుల అబు జానీ సందీప్ ఖోస్లా బ్రైడల్ లెహంగా, అనంత్ ధరించిన సబ్యసాచి షేర్వానీ కేవలం ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్స్ మాత్రమే కాదు, అవి భారతీయ సంస్కృతికి ఇచ్చిన ఓ గౌరవం అని చెప్పొచ్చు.
జర్దోషి, మిర్రర్ వర్క్, సాంప్రదాయ భారతీయ సిల్హౌట్ వాడకం ద్వారా ఈ వివాహం దేశ గొప్ప వస్త్ర, డిజైన్ వారసత్వాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, ప్రముఖ కళాకారులు ఈ దుస్తులు, ఆభరణాల తయారీకి సహకరించారు.
ఇది వివాహానికి భారతీయ కళా సంప్రదాయాలతో మరింత అనుబంధాన్ని పెంచింది. అంటే, ఈ పెళ్లిలో ప్రతి అలంకరణ, వంటకం, వస్త్రధారణ, ఆచారం అంతా మన మూలాలను, ప్రామాణికతను ప్రతిబింబించాయి. ఇది అంబానీ, మర్చంట్ కుటుంబాలు తమ సంప్రదాయాలను ఎంతగా గౌరవిస్తాయో చూపించింది.
ఈ వివాహాన్ని ప్రపంచం మొత్తంప్రశంసించింది. ఓ ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. సీఎన్ఎన్, బీబీసీ, వోగ్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ వేడుకలను కవర్ చేశాయంటే.. దీనికి ఉన్న గొప్పదనం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆయా మీడియా సంస్థలన్నీ కూడా వివాహ ఆడంబరాన్ని కాకుండా భారతీయ సాంస్కృతిక లోతు ప్రపంచానికి తెలియజేశాయి.
మన ఆచార వ్యవహారాలు, భక్తి గీతాలు, పెద్దలు- బంధుమిత్రుల ఆశీర్వాదాలు.. ఇవన్నీ చాలా దగ్గరగా, స్పష్టంగా చూపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఈ పెళ్లి నిజంగా గర్వకారణంగా నిలిచిందనడంలో సందేహాలు అక్కర్లేదు.
ఈ మధ్య చాలా పెద్ద పెద్ద వేడుకలు వెస్టర్న్ స్టైల్‌లో, సింపుల్‌గా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో, అనంత్, రాధికల పెళ్లి మన మూలాలకు కట్టుబడి ఉండాలని శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చింది. ఆధునికత, సంప్రదాయం అందంగా కలిసి జీవించగలవని, ప్రేమకు నిజమైన వ్యక్తీకరణ మనం ఎక్కడి నుండి వచ్చామో గౌరవించడమే అని అనంత్-రాధికాల కలయిక పునరుద్ఘాటించింది.
ప్రతి ఆచారం, ప్రతి కార్యక్రమం ద్వారా, వధూవరులు, వారి కుటుంబాలు భారతీయ కుటుంబ విలువలుగా చెప్పుకునే పెద్దల పట్ల గౌరవం, సామూహిక జీవనం, ఆధ్యాత్మిక పునాది, సంప్రదాయాలను ప్రదర్శించారు. ఈ పెళ్లి జరిగి ఏడాది అవుతున్నా, వివాహం చేసుకోవాలన్న యువతకు తమ మూలాలను ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో జరుపుకునేందుకు ఓ స్ఫూర్తినిస్తోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications