Modi 3.0: మోదీకి ప్రజాదరణ తగ్గిందా..లెక్కలు ఏం తేల్చాయి..?
Modi from Varanasi:దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ మే నెలల్లో ఈ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సమయానికి జరిగిన విషయం తెలిసిందే. ఇక ఫలితాలు జూన్ 4వ తేదీన వచ్చాయి. కేంద్రంలో ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అయితే కూటమిగా ఎన్డీయే కూడా ఇండి కూటమి నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంది. ఇక నరేంద్ర మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బరిలో దిగిన లోక్‌సభ స్థానం వారణాసిలో ఆయన ఎలాంటి పోటీని ఎదుర్కొన్నారు.. అసెంబ్లీ వారీగా ఆయన పొందిన ఓట్లు ఎన్ని అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం.
ఎర్లీ ట్రెండ్స్‌లో మోదీ వెనుకంజ
నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధించారు. కానీ 2024లో మాత్రం ఆయన గెలుపునకు చెమటోడ్చాల్సి వచ్చింది. వారణాసి లోక్‌సభ పరిధిలో రోహనియా,వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభం కాగా తొలి ట్రెండ్స్‌లో మోదీ వెనుకబడి ఉన్నారు.ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు.

2014 నుంచి 2024 వరకు...
2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి మోదీకి 6,12,970 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 4,60,457 ఓట్లు పోలయ్యాయి. దీంతో నరేంద్ర మోదీ 1,52,513 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఇదే 2019 ఎన్నికల్లో వారణాసి నుంచే పోటీ చేసిన నరేంద్ర మోదీ 4,79,505 మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి షాలినీ యాదవ్‌పై నెగ్గారు. 2014లో మోదీ 3,71,784 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై 3,71,784 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. అయితే 2014 నుంచి 2024 వరకు సరిగ్గా గమనిస్తే మోదీ మెజార్టీ క్రమంగా తగ్గుతూ వస్తోంది.ఓవరాల్‌గా చూసుకుంటే ఉత్తర్ ప్రదేశ్‌నుంచి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు.అందులో ప్రధాని అభ్యర్థిగా మోదీ వారణాసి నుంచి పోటీ చేసినప్పటికీ చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువగా ఓట్లు పోలయ్యాయి.

ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్ని ఓట్లు..
రోహనియా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మోదీకి లక్ష నుంచి 1,50,000 ఓట్లు నమోదు కాగా, సేవాపురి సెగ్మెంట్‌లో లక్ష ఓట్లు మాత్రమే పోలైనట్లు తెలుస్తోంది. ఇక వారణాసి కంటోన్మెంట్‌లో లక్ష నుంచి 1,50,000 ఓట్ల మధ్య మోదీకి ఓట్లు రాగా...వారణాసి నార్త్ నియోజకవర్గంలో లక్ష నుంచి లక్షా 25 వేల ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఇచ వారణాసి సౌత్ నియోజకవర్గంలో అయితే లక్షకు తక్కువగానే ఓట్లు పోలైనట్లు డేటా చెబుతోంది. దీంతో ఓవరాల్‌గా 1,52,513 ఓట్లతో మోదీ విజయం సాధించారు. మోదీకి క్రమంగా ప్రజాదరణ తగ్గుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఇండి కూటమి కూడా దేశవ్యాప్తంగా పుంజుకుంటోందని చెబుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications