మోదీ 3.0.. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతికి విజ్ఞప్తి.. అసలు సినిమా మొదలవుతుంది.. గెట్ రెడీ!!

నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ మేరకు సౌమ్య పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో మోడీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు ఆపై అన్ని పార్టీలు ఆమోదాన్ని తెలిపాయి. ఆపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి సెంట్రల్ హాల్లో ప్రసంగాన్ని చేశారు.

ఆపై ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా నరేంద్రమోడీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. నరేంద్ర మోడీతో పాటు 15మందికి పైగా ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్మును కలిశారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన నాయకులలో రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితీష్ కుమార్ లతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తదితరులు ఉన్నారు.

Modi 3 0 met president draupadi murmu to form govt The real movie starts soon Get ready

జూన్ 9వ తేదీన నరేంద్ర మోడీ భారత ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక మూడవ సారి పాలన పగ్గాలు చేపట్టనున్న క్రమంలో నరేంద్ర మోడీ సుపరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. దేశానికి ఎన్డీఏ పైన విశ్వాసం ఉందని పెరిగిన భారతీయుల అంచనాలకు తగ్గట్టుగా పాలన అందిస్తామని నరేంద్ర మోడీ వెల్లడించారు.

గత పదేళ్ల పని ట్రైలర్ మాత్రమేనని, వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తామని అసలు సినిమా మొదలవుతుందని మోడీ తెలిపారు. భారతదేశ పరువు తీసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మోడీ పేర్కొన్నారు. పదేళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్ 100 మార్కును దాటలేదన్నారు.దేశానికి ఎన్డీయే పైనే విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసిన నేపథ్యంలో త్వరలో మోడీ ప్రమాణస్వీకారం జరగనుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి ప్రపంచ నేతలు హాజరు కానుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+