ఆ విషయం నన్ను కాదు.. చంద్రబాబును అడగండి: మీడియాపై ఫైర్..!!
PM Modi new cabinet meeting: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ.

ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా లభించింది 240 సీట్లు మాత్రమే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మాత్రమే అధికంగా లభించిన నేపథ్యంలో టీడీపీ- 16, జేడీయూ- 12 సీట్లు అత్యంత కీలకంగా మారాయి బీజేపీకి.
కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ 3.0గా పిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీ సొంతంగా బలం లేనందున దీన్ని ఎన్డీఏ 3.0గా పిలవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలపై ఆధారపడి ఏర్పాటైన ప్రభుత్వం కావడం వల్ల ఈ ఘనతను మోదీ ఒక్కరికే ఇవ్వడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా స్పందించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ 3.0గా పిలవడం సరికాదని, ఇది ఎన్డీఏ 3.0 అని వ్యాఖ్యానించారు. మోదీ 3.0గా పిలవాలనుకుంటే మాత్రం ఆ విషయంపై చంద్రబాబు, నితీష్ కుమార్‌కు ఈ ప్రశ్నను అడగాలని పవన్ ఖేరా బదులిచ్చారు.
నెహ్రూ, గాంధీ కుటుంబాలు, కాంగ్రెస్‌ను ఇష్టానుసారంగా తిట్టినవారికి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనే విషయం ఇప్పుడు మోదీకి బోధపడి ఉంటుందని ఆయన అన్నారు. హిందు-ముస్లింల గురించి మాట్లాడిన అనురాగ్ ఠాకూర్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించలేదని ఖేరా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications