వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ యాప్‌తో జర భద్రం: ఫ్రాన్స్ నిపుణుడి సంచలనం, రాహుల్‌ చేతికి కొత్త అస్త్రం...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ప్రభుత్వం రూపొందించిన 'నమో' యాప్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుడు ఇలియట్ ఎల్డర్సన్ హెచ్చరించారు. ఈ యాప్ ఉపయోగించే యూజర్ల సమాచారం రహస్యంగా అమెరికాకు చెందిన 'క్లెవర్ ట్యాప్' అనే సంస్థకు చేరుతోందంటూ ట్విట్టర్ ద్వారా ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు.

యూజర్ల సమాచారం ఎవరికీ తెలియకుండా క్లెవర్ ట్యాప్‌ డొమైన్ అయిన 'ఇన్‌డాట్ డబ్ల్యూజెడ్ఆర్‌కేటీ డాట్ కామ్'కు వెళ్లిపోతోందని ఇలియట్ ఎల్డర్సన్ వివరించారు. నమో యాప్‌ను వినియోగిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు సహా ఫొటోలు కూడా ఆ సంస్థకు చేరుతున్నాయన్నారు. మరోవైపు అవకాశం లభించినప్పుడల్లా మోడీపై విరుచుకుపడే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో సరికొత్త అస్త్రం దొరికినట్లయింది.

 యూజర్ల వివరాలు తస్కరిస్తున్న క్లెవర్ ట్యాప్?

యూజర్ల వివరాలు తస్కరిస్తున్న క్లెవర్ ట్యాప్?

అమెరికాకు చెందిన క్లెవర్ ట్యాప్ ఓ అత్యాధునిక యాప్ నిర్వహణ వేదిక. యూజర్లను గుర్తించి డెవలపర్స్‌ను అభివృద్ధి చేసేందుకు మార్కెటింగ్ నిపుణులకు ఈ సంస్థ సాయపడుతుంది. అయితే నరేంద్రమోడీ యాప్ యూజర్ల సమాచారాన్ని క్లెవర్ ఎందుకు భద్ర పరుస్తుందన్నదే అంతుచిక్కని ప్రశ్న. ఈ క్లెవర్ ట్యాప్‌ డొమైన్‌ను ‘గోడాడీ' సంస్థ నిర్వహిస్తోంది.

ఫేస్‌బుక్‌ను వివరణ కోరిన తరుణంలోనే....

ఫేస్‌బుక్‌ను వివరణ కోరిన తరుణంలోనే....

సరిగ్గా ఫేస్‌బుక్ యూజర్ల సమాచారం లీక్ పై అధికారికంగా భారత్ వివరణ కోరిన తరుణంలోనే ప్రధాని అఫీషియల్ యాప్ నరేంద్రమోడీ డేటా లీకేజీ అంశం తెరపైకి రావడం గమనార్హం. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని మోడీ యాప్ తృతీయపక్ష కంపెనీలకు అందిస్తోందన్నది తాజా ఆరోపణ. మరోవైపు ఈ వార్తపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు కురిపిస్తున్నారు.

రాహుల్ చేతికి సరికొత్త అస్త్రం...

రాహుల్ చేతికి సరికొత్త అస్త్రం...

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సంబంధించిన మొబైల్ యాప్ ‘నరేంద్రమోడీ' యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందంటూ ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ నిపుణుడు ఇలియట్ ఎల్డర్సన్ వెల్లడించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో అస్త్రం దొరికినట్లయింది. ఆదివారం దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన మోడీపై విమర్శలకు దిగారు.

వ్యంగ్యంగా రాహుల్ ట్వీట్లు...

నరేంద్ర మోడీ యాప్ డేటా లీక్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ‘హాయ్ నా పేరు నరేంద్రమోడీ. నేను భారత ప్రధానమంత్రిని. మీరు నా మొబైల్ యాప్ లో సైన్‌ఇన్ అయినప్పుడు మీ డేటా మొత్తాన్ని నేను అమెరికన్ కంపెనీల్లోని నా స్నేహితులకు చేరవేస్తాను..' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అలాంటిదేం లేదు, నమ్మకండి: కేంద్ర మంత్రి

అలాంటిదేం లేదు, నమ్మకండి: కేంద్ర మంత్రి

ప్రధాని నరేంద్ర మోడీ అఫీషియల్ యాప్ ‘నరేంద్రమోడీ' నుంచి యూజర్ల వివరాలు థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కు చేరుతున్నాయని వచ్చిన వార్తలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేజీ ఆల్ఫోన్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. యూజర్ల వివరాలు లీకయ్యే సమస్యే ఉండదన్నారు. ఇలాంటి వార్తలు, పుకార్లు నమ్మవద్దని ఆయన సూచించారు.

English summary
The French cyber security expert who goes by the name Elliot Alderson on social media and has been exposing loopholes in the Aadhaar security system since January claimed on Friday that Narendra Modi Android application shares private information of its users with third party companies without their consent. Alderson’s claim follows the revelation that the British company Cambridge Analytica illegally used private data of over five crore Facebook users to influence the 2016 American presidential election in favour of Donald Trump. The exposé brought the Indian prime minister’s mobile app under scrutiny, with opposition parties and civil rights activists launching the social media campaign “DeleteNaMoApp”. Alderson’s claim is a shot in the arm for the campaigners. Congress President Rahul Gandhi on Sunday took to Twitter to launch a fresh attack on Prime Minister Narendra Modi, that user information on the Narendra Modi App was being leaked to American companies. Gandhi also blamed the "mainstream media" for burying critical stories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X