మోడీ చైనా టూర్: డాజింగ్ షా ఆలయంలో పూజలు, సరిహద్దు వివాదంపై చైనా

బీజింగ్: ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో పర్యటిస్తున్నారు. చైనా పర్యటనలో ప్రధాని మోడీ జియాన్‌లోని ప్రఖ్యాత డా జింగ్‌ షా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రార్థనలు చేశారు. డా జింగ్‌ షా ఆలయాన్ని జింగ్‌ చక్రవర్తి పరిపాలనలో నిర్మించారు.

చైనాలో ఉన్న అతి ప్రాచీన బౌద్ధ ఆలయం ఇది. ఇదే ప్రాంతంలో చైనా తాంత్రిక బౌద్ధగురువు జన్మించారు. అంతకుముందు జియాన్‌లోని టెర్రాకొట్టా వారియర్స్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడి శిల్పాలను పరిశీలించారు. అఖ్కడ ఎనిమిది వేల ఏళ్ల నాటి కలెక్షన్స్ ఉన్నాయి.

మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా మోడీ గురువారం ఉదయం షియాంగ్ చేరుకున్నారు. చైనా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చైనా కళాకారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. బీజింగులో చైనా ప్రధానితో సమావేశమై సరిహద్దు సమస్య తదితర అంశాలను చర్చిస్తారు. ప్రధాని మోడీ 19వ తేదీ వరకు చైనా, మంగోలియా, దక్షిణ కొరియాలలో పర్యటించనున్నారు.

 Modi in China: Narendra Modi visits Terracotta Warriors Museum

పర్యటనకు బయలుదేరేముందు...

భారత్, చైనాల మధ్య దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం రాత్రికి రాత్రి పరిష్కారం కాబోదని చైనా బుధవారం వ్యాఖ్యానించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం రేపు చైనాకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ ఇక్కడ మాట్లాడుతూ... చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరిపే చర్చల్లో భారత ప్రధానమంత్రి మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ రాత్రికి రాత్రే ఈ వివాదం పరిష్కారం కాజాలదన్నారు.

ఈ సరిహద్దు అంశంపై ప్రత్యేక ప్రతినిధుల యంత్రాంగం, ఇతర యంత్రాంగాల ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకునేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని, ఈ దిశగా పురోగతి సాధించామని ఆమె వివరించారు.

సరిహద్దు వివాదాన్ని పరస్పర అంగీకారంతో సహేతుకంగా పరిష్కరించుకునేందుకు భారత్‌తో సంప్రదింపులు కొనసాగించడానికి చైనా సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. సరిహద్దు వివాదానికి తుది పరిష్కారం ఇంకా లభించక పోయినప్పటికీ సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల కోసం ఉభయ దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+