శబరిమలపై మొదటిసారి స్పందించిన మోడీ... కాంగ్రెస్ - లెఫ్ట్‌కు తేడా లేదని ధ్వజం
ఢిల్లీ : శబరిమల అంశంపై ప్రధాని మోడీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన తరుణంలో మొదటిసారిగా మాట్లాడిన మోడీ కేరళ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శబరిమల ఆలయం విషయంలో కేరళ సర్కార్ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు. చరిత్రలోనే అత్యంత హేయనీయమైన చర్యగా అభివర్ణించారు.

ఆ రెండింటికీ పెద్ద తేడా లేదు
కాంగ్రెస్, వామపక్ష పార్టీల పాలనపై మోడీ ఫైరయ్యారు. ఆ రెండింటికీ పెద్ద తేడా లేదన్నారు. కులం, మతం, అవినీతి అంశాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వానికి.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఒకే నాణేనికి రెండు వైపులని ఎద్దేవా చేశారు. శబరిమల అంశంపై కేరళ ప్రభుత్వం తీరు అత్యంత హేయనీయమైన చర్యగా చరిత్రలో నిలిచిపోతుందని ధ్వజమెత్తారు. ఇంతకుముందు ఏ పార్టీ గానీ ప్రభుత్వం గానీ ఇలా ప్రవర్తించలేదన్నారు. కమ్యూనిస్టులు ఆధ్యాత్మికపరమైన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించరనే విషయం అందరికి తెలుసని.. కానీ ఇంత హీనంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు ఊహించలేదన్నారు.

రెండు నాల్కల ధోరణి
శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడం సరికాదన్నారు మోడీ. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై పార్లమెంట్ లోపల ఒకలా మాట్లాడుతూ.. కేరళలో మరోలా మాట్లాడుతున్న పద్దతి మంచిదికాదని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు. కేరళ ప్రజలకు అండగా ఉండాలన్నా.. వారి సంప్రదాయాలకు రక్షణగా నిలవాలన్నా అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను తక్కువగా చూడొద్దని
యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పార్టీలకు అల్టిమేటం ఇచ్చారు.

చౌకీదార్ అడ్డు తొలగించాలనే కుట్ర
కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కొల్లాం లోని నేషనల్ హైవే 66 పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును, బలంగీర్ లో 1550 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమాల్లో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. కుంభకోణాలు బయటపెడుతున్నందుకు తనను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో దొంగ పత్రాలు సృష్టించి పింఛన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు ఇలా అక్రమంగా 90వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని.. ఆ కుంభకోణం అడ్డుకుంటే అక్రమార్కులంతా ఒక్కటయ్యారని ఆరోపించారు. అందుకే ఈ చౌకీదార్ అడ్డు తొలగించుకోవాలనే కుట్ర జరుగుతుందన్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications