మోడీ బర్త్ డే: చికాగోలో 13వేల అడుగుల ఎత్తు నుంచి దూకుతూ మహిళ గ్రీటింగ్స్ (వీడియో)
Recommended Video

న్యూఢిల్లీ/చికాగో: సోమవారం... 17 సెప్టెంబర్ భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఓ మహిళా పారా జంపర్ మాత్రం ప్రధానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 13,000 అడుగుల ఎత్తు నుంచి విమానం నుంచి దూకుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలోని చికాగోలో ఆమె ఈ ఫీట్‌తో మోడీకి 68వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పేరు శీతల్ మహాజన్. మోడీకి పెద్ద అభిమాని. చికాగోలో ఉంటున్నారు. స్కైడైవర్.

మోడీని అభిమానించే మహాజన్.. వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పడానికి దీనిని ఎంచుకున్నారు. 13,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి దూకి హ్యాపీ బర్త్‌డే మోడీ అని రాసున్న ప్లకార్డును చూపిస్తూ వీడియో తీయించారు. ఈ వీడియోను శీతల్ తన ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశారు.
'గౌరవనీయ భారత ప్రధాని మోడీకి 13వేల అడుగుల ఎత్తు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాతో పాటు ఉన్న నా సహ స్కైడైవర్ సుదీప్ కొడవాటి ఈ వీడియోను తీశారు. గత నాలుగేళ్ల నుంచి మోడీని కలవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఆయన కార్యాలయం నుంచి నాకు ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఇలా విమానం నుంచి దూకి శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. కనీసం ఈ వీడియో చూసి ఆయన నన్ను కలుస్తారని చిన్న ఆశ' అని పేర్కొన్నారు.
కాగా, బీజేపీ నేతలు ప్రకాశ్ జవదేకర్, ముక్తార్ అబ్బాస్ నక్వీలు 568 కిలోల లడ్డూను తయారు చేయించి అభిమానం చాటుకున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications