మోడీ గిఫ్ట్: వడోదర నుండి అమిత్ షా, రక్షణ మంత్రిగా?

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోకసభ స్థానాల్లో 71 స్థానాలను బిజెపి గెలుచుకోవడానికి అహర్నిషలు కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజం అమిత్ షాకు ఇటీవలి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరు భావించారు. ఆ తర్వాత బిజెపి అధ్యక్షుడి రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనకు మోడీ రక్షణ శాఖను అప్పగించే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కేంద్రమంత్రివర్గంలో అతికీలకమైన శాఖల్లో రక్షణ శాఖ ఒకటి. మోడీకి అమిత్ షా నమ్మిన బంటు. యూపిలో అత్యధిక స్థానాల్లో గెలిపించిన ఈ మోడీ నమ్మిన బంటును బిజెపి ఉప ఎన్నికల్లో వడోదర నుండి పోటీ చేయించే అవకాశముందని చెబుతున్నారు.

Modi gives up Vadodara, Amit Shah may contest seat

సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి, గుజరాత్‌లోని వడోదరల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. రెండింట్లో ఆయన ఘన విజయం సాధించారు. తనను కాశీకి గంగామాత పిలిచిందని ప్రచారం సమయంలో చెప్పిన మోడీ.. గంగాశుద్ధి కోసం, కాశీ సమస్యల పరిష్కారం కోసం వారణాసి లోకసభను అట్టిపెట్టుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వడోదర లోకసభకు రాజీనామా చేశారు.

ఈ వడోదరకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఉప ఎన్నికల్లో అమిత్ షాను పోటీ చేయించాలని బిజెపి, ముఖ్యంగా మోడీ భావిస్తున్నారట. వడోదర నుండి అమిత్ షాను గెలిపించి ఆయనను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకొని... రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+