మోడీ అద్భుతం, ప్రపంచం మొత్తం ప్రేమిస్తోంది: భారత ప్రధానితో ఫోన్‌లో డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) బుధవారం ట్రంప్‌నకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాల నేతలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

'స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడాను. అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆయనకు అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం తదితర అనేక రంగాల్లో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేదిశగా డొనాల్డ్ ట్రంప్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Modi is a wonderful man loved by the whole world Donald Trump on phone with Indian PM

ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన వ్యక్తి అని.. ప్రపంచం మొత్తం మోడీని ప్రేమిస్తోందని డొనాల్డ్ ట్రంప్ తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్ అద్భుతమైన దేశమని, మోడీ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడినట్లు తెలిపాయి. మోడీని, భారత్‌ను నిజమైన స్నేహితులుగా భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారని, విజయం తర్వాత తాను మాట్లాడిన మొదటి ప్రపంచ నేతల్లో ప్రధాని మోడీ ఒకరని పేర్కొన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

కాగా, అంతకుముందు ట్రంప్ విజయం దాదాపు ఖరారైన సందర్భంలోనూ ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగాఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దామని, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని మోడీ ట్వీట్ చేశారు. గతంలో పలు వేదికల్లో ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను మోడీ పంచుకున్నారు.

ట్రంప్ విజయభేరి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. తాజాగా విస్కాన్సిన్‌లో గెలుపుతో మేజిక్ ఫిగర్ (270)ను దాటి 292 ఎలక్టోరల్ ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. అంతేగాక, ఇంకా రెండు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా 17కుపైగా ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలను ట్రంప్ సొంత చేసుకున్నారు. మరో మూడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమెరికా 130 ఏళ్ల చరిత్రలోనే ట్రంప్ ఈ మేరకు ఘన విజంయ సాధించడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+