రాహుల్ 'కొబ్బరి జ్యూస్', బంగాళాదుంప పరిశ్రమపై కాంగ్రెస్ వివరణ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన కొబ్బరి జ్యూస్, బంగాళాదుంప పరిశ్రమల పైన సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. దీనిపై ప్రధాని మోడీ కూడా ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన కొబ్బరి జ్యూస్, బంగాళాదుంప పరిశ్రమల పైన సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. దీనిపై ప్రధాని మోడీ కూడా ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ యూపీ, మణిపూర్‌లలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొబ్బరి జ్యూస్, బంగాళాదుంప పరిశ్రమలు అంటూ మాట్లాడారు.
దీనిపై మోడీ అప్పుడే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడొకరున్నారని, ఆయనకు ఆ దేవుడు దీర్ఘాయుష్షును ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని, ఈమధ్య ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం మణిపూర్ వెళ్లారని, అక్కడి రైతులతో మాట్లాడుతూ కొబ్బరికాయల నుంచి జ్యూస్ తీసి లండన్‌కు పంపిస్తానని చెప్పారని మోడీ గుర్తు చేశారు.

నిజానికి కొబ్బరిలో ఉండేది నీళ్లు అని, అవి పెరిగేది కేరళలో అని మోడీ చెప్పారు. అదే రాహుల్ గాంధీ యూపీలో బంగాళా దుంపల కర్మాగారం గురించి మాట్లాడారని మోడీ అన్నారు. అలాంటి ప్రతిభ, దీర్ఘదృష్టి ఉన్న నేత ఆయన అని ఎద్దేవా చేశారు.
అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మోడీ అబద్దాలు చెబుతున్నారని, రాహుల్ గాంధీ కొబ్బరి జ్యూస్ అనలేదని, నారంగి జ్యూస్ (ఆరెంజ్ జ్యూస్) అన్నారని తెలిపింది. మోడీ అబద్దాల జ్యూస్‌లు చెబుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌జీత్ సుర్జేవాలా అన్నారు.












Click it and Unblock the Notifications