జనాల బాత్రూంలలోకి తొంగిచూడటం మోడీకి అలవాటు: రాహుల్ కౌంటర్
జనాల బాత్రూంలలోకి తొంగిచూడటం మోడీకి అలవాటని లక్నో ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: గత బుధవారం రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో.. ఆయన మన్మోహన్ గత పాలనపై పరోక్ష రీతిలో చురకలంటించారు.
భారీ స్కామ్ జల్లుల నడుమ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని ఆయన మాత్రం నిజాయితీగా ఉన్నారంటూ మోడీ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు.

జనాల బాత్రూంలలోకి తొంగిచూడటం మోడీకి అలవాటని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. లక్నోలో అఖిలేష్ యాదవ్ తో కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రాం పేరిట పది అంశాలతో ఎజెండాను విడుదల చేశారు రాహుల్. ఈ సందర్బంగా ఆయన ప్రధానిపై విమర్శలు గుప్పించారు.
గడిచిన రెండున్నరేళ్లలో మోడీ దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎస్పీతో పొత్తుల విషయంలో ఆరేడు సీట్లు ఇంకా సర్దుబాటు కాలేదని, ఆ సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. 99శాతం సీట్లు చేజిక్కుంచుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.
ఇదే సభలో అఖిలేష్ మాట్లాడుతూ మోడీ తీరును ఎద్దేవా చేశారు. కొంతమంది మన్ కీ బాత్ చెబుతున్నారు గానీ కామ్ కీ బాత్ చెప్పట్లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications