మోడీ మేజిక్: విస్తరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల అనంతరం కూడా ప్రధాని నరేంద్ర మోడీ హవా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మంగళవారం వచ్చిన జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే మోడీ వేవ్ ఇంకా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ కూటమి జార్ఖండ్ 42 స్థానాలు గెలుపొంది స్పష్టమైన మెజార్టీ సాధించింది. జమ్మూ కాశ్మీర్‌లో 25 స్థానాలు గెలుపొంది రాష్ట్రంలో పీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ఇన్ని సీట్లను గెలుచుకోవడం గమనార్హం. ఇదంతా మోడీ ప్రభావమేనని అంటున్నారు.
2014 లోకసభ ఎన్నికల అనంతరం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మోడీ లేదా బీజేపీ పిలుపునిచ్చినట్లుగా కాంగ్రెస్ రహిత భారత దేశం వైపు దూసుకెళ్తున్నామని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనను కాదని బీజేపీ ఒంటరిగా పోటీ చేసి స్వల్ప స్థానాల దూరంలో మేజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. అనంతరం పలు పరిణామాల అనంతరం శివసేనతో జట్టుకట్టింది. హర్యానాలో మెజార్టీ వచ్చి బీజేపీ అధికారం దక్కించుకుంది.
మహారాష్ట్రలో నిన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలను ప్రజలు తిరస్కరించారు. హర్యానాలోను అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. అనంతరం ఇప్పుడు జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి.
జార్ఖండ్‌లో 2009లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఏకంగా 42 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపట్టింది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఏకంగా తన బలాన్ని రెండింతలకు పైగా పెంచుకుంది. అంతేకాదు, ఎన్సీపీతో పాటు ఇతరులు కలిస్తే అధికారంలోకి వచ్చే స్థాయిలో గెలుపొందింది లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండనుంది.
గెలుపుపై మోడీ...
జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి బాసటగా నిలిచిన ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు. జార్ఖండ్ ప్రజలు సుస్థిర ప్రభుత్వం కాంక్షతోనే తమకు ఓటేశారని ఆయన చెప్పారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications