పెద్ద నోట్లపై వేటు: రియాల్టీ ఢమాల్, విదేశీ బ్యాంక్‌ల్లో సొమ్ము వేస్టే

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రభావం వివిధ రంగాలపై పడే అవకాశం ఉంది. సామాన్యుడు తాత్కాలికంగా ఇబ్బందులకు గురైనప్పటికీ అక్రమ లావాదేవీలపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏడాది పాటు ప్రస్తుత అనిశ్చితి ఉంటుందని, తర్వాత పరిస్థితి సాధారణమవుతుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ధన వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. త్వరలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల్లో పెద్ద యెత్తున నల్లడబ్బు చేతులు మారుతుంది. వచ్చే ఎన్నికల్లో దానికి బ్రేకులు పడే అవకాశం ఉంది. ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చేరవేసేందుకు వీలు కాదు. లెక్కలు చూపకుండా ఎన్నికల్లో చేసే వ్యయం చేసే ధనం తగ్గే అవకాశాలున్నాయి.

రియాల్టీ ఢమాల్‌!

రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. చాలా వరకు దేశంలో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. పైగా నల్లడబ్బు ఎక్కువగా ఈ రంగంలోనే పేరుకుపోయింది. తెల్ల, నల్ల డబ్బుల నిష్పత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 60:40 నిష్పత్తి ప్రకారం ఉంటుంది.

Modi's decission: Cash no longer king, realty prices may drop

దాంతో సెకండరీ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. నేరుగా డెవలపర్ నుంచి ఓ ప్రాజెక్టులో ఇళ్లు కొనే ప్రైమరీ మార్కెట్‌పై దీని ప్రభావం ఉండదని అంటున్నారు. రియాల్టీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలో పడుతుందని మాత్రం చెబుతున్నారు.

ప్రైమరీ మార్కెట్లో ఇళ్లను బ్యాంక్ రుణాలపై ఆధారపడి విక్రయిస్తారు. దానిపై ప్రభావం పడదు కానీ డెవలపర్స్ బ్యాంక్‌ రుణానికి మించిన ఖరీదుకు విక్రయించి, నగదు రూపంలో తీసుకునే వ్యవహారానికి బ్రేక్ పడుతుంది. ఇది ప్రైమరీ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

విదేశీ బ్యాంకుల్లో దాచింది చెత్తనే..

నల్లడబ్బు రూపంలో విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బంతా ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఆ డబ్బును తెచ్చి ఇక్కడి బ్యాంకుల్లో మార్చుకోవడానికి కూడా కుదరదు. నల్లడబ్బుపై వేటుకు ప్రస్తుత మోడీ ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుంది. విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బును దేశానికి తిరిగి తేవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దీనివల్ల అధిగమించడానికి వీలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+