మోడీ కేబినెట్ ఇదే..: వెంకయ్య, అశోక్ ప్రమాణం

న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు 23 మంది కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మన రాష్ట్రం నుండి వెంకయ్య నాయుడు, అశోక గజపతి రాజులకు కేబినెట్లో స్థానం లభించింది.

మోడీ మంత్రివర్గంలో 23 మంది కేబినెట్ మంత్రులతో పాటు పదిమంది స్వతంత్ర హోదాగల మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో ప్రకాశ్ జవదేకర్, వికె సింగ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, సంతోష్ గాంగ్వర్, శ్రీపాద నాయక్, సోన్వాల్, జితేంద్ర సింగ్, పీయుష్ గోయెల్, రావు ఇందర్ జిత్ సింగ్ ఉన్నారు.

Modi's minister makes blunder while taking oath

ప్రమాణ స్వీకారం చేసిన వారు....

నరేంద్ర మోడీ - ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. వారణాసి (యూపి), వడోదర (గుజరాత్)... రెండు లోకసభ నియోజకవర్గాల నుండి గెలుపొందారు.

రాజ్‌నాథ్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. లక్నో(యూపి) నుండి గెలుపొందారు. మంత్రిగా పని చేసిన అనుభవం

సుష్మా స్వరాజ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. విదిష (మహారాష్ట్ర) నుండి గెలుపొందారు. మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం.

అరుణ్ జైట్లీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయశాఖ మంత్రిగా అనుభవం. అదనపు సొలిసిటర్‌గా పని చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులు.

వెంకయ్య నాయుడు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు. రాజ్యసభకు మూడుసార్లు వెళ్లారు. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు.

నితిన్ గడ్కరీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. నాగపూర్ (మహారాష్ట్ర) నుండి గెలుపొందారు.

సదానంద గౌడ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు ఉత్తర (కర్నాటక) నుండి ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి.

ఉమాభారతి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఝాన్సీ (ఉత్తర ప్రదేశ్) నుండి గెలుపొందారు.

నజ్మా హెఫ్తుల్లా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్. బిజెపి ఉపాధ్యక్షురాలు. ఐదుసార్లు లోకసభకు వచ్చారు.

గోపినాథ్ ముండే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. బీడ్ (మహారాష్ట్ర) నియోజకవర్గం నుండి గెలుపొందారు. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి. 2009లో లోకసభకు ఎన్నికయ్యారు.

రామ్ విలాస్ పాశ్వాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. హాజీపూర్ (బీహార్) నుండి గెలుపొందారు. లోకసభకు ఎనిమిదిసార్లు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ అధ్యక్షులు.

కల్రాజ్ మిశ్రా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. దేవరియా (యూపి) నుండి గెలుపొందారు. యూపి రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవం. రాజ్యసభ సభ్యుడిగా అనుభవం.

మేనకా గాంధీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. పిలిపిత్ (యూపి) నుండి గెలుపొందారు. పర్యావరణవేత్త, జంతుసంరక్షణ ఉద్యమాకారిణి. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

అనంత్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. బెంగళూరు దక్షిణ (కర్నాటక) నుండి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఆరుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

రవిశంకర ప్రసాద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా అనుభవం. గతంలో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు.

అశోక గజపతి రాజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. విజయనగరం (ఆంధ్రప్రదేశ్) నుండి గెలుపొందారు. ఎపిలో పలు శాఖల్లో మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో 36 ఏళ్ల రాజకీయ అనుభవం. టిడిపి ఎంపీ.

అనంత్ గీతే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. కేంద్రమంత్రిగా అనుభవం. ఐదుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రాయఘడ్ (మహారాష్ట్ర) నుండి గెలుపొందారు. శివసేన ఎంపీ.

హర్ స్మిత్ కౌర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భటిండా (పంజాబ్) నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజిక ఉద్యమకారిణి.

నరేంద్ర సింగ్ తోమర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. గ్వాలియర్ నుండి గెలుపొందారు. మున్నాభయ్యాగా అభిమానుల్లో గుర్తింపు.

జ్యూయల్ ఓరమ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. సుందర్ ఘడ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం.

రాధా మోహన్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. పూర్వీ చంపారన్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

టిసి గెహ్లాట్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు.

స్మృతి ఇరానీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యురాలు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

హర్షవర్ధన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. చాందినీ చౌక్ (ఢిల్లీ) నుండి గెలుపొందారు. ఢిల్లీ మాజీ మంత్రి. గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి.

జనరల్ వికె సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. ఘజియాబాద్ (యూపి) నుండి గెలుపొందారు. మాజీ సైన్యాధిపతి. రక్షణ శాఖలో విశిష్ట సేవలు అందించారు.

రావ్ ఇంద్రజిత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. గురుగావ్ (ఢిల్లీ) నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం.

సంతోష్ గ్యాంగ్ వర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. బరేలీ నుండి గెలుపొందారు. ఏడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజికవేత్తగా సుపరిచితులు.

శ్రీపాద్ నాయక్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. ఉత్తర గోవానుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

ధర్మేంద్ర ప్రదాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులు (బీహార్). బిజెపి యువమోర్చా నాయకుడు. గతంలో రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

శర్వానంద్ సోనోవాల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లఖింపూర్ (అసోం) నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. రెండుసార్లు లోకసబకు ఎన్నికయ్యారు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

ప్రకాశ్ జవదేకర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిజెపి అధికార ప్రతినిధి.

పీయూష్ గోయల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. బిజెపి కోశాధికారి. 27 ఏళ్ల రాజకీయ అనుభవం. రాజ్యసభ సభ్యులు.

జితేంద్ర సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. ఉదంపూర్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు. జమ్మూ కాశ్మీర్‌లో కీలక బిజెపి నేత.

నిర్మలా సీతారామన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి పేరు మీద ప్రమాణం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు. ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి పేరు మీద ప్రమాణం చేశారు. దావణగెరె (కర్నాటక) నుండి గెలుపొందారు. ఆంగ్రంలో ప్రమాణం చేశారు. వరుసగా మూడోసారి లోకసభకు ఎన్నికయ్యారు.

మనోజ్ సిన్హా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. గాజీపూర్ నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ అధ్యక్షుడు.

నిహాల్ చంద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు.

ఉపేంద్ర కుశ్వాహా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. కరాకట్ నుండి గెలుపొందారు. రాష్ట్రీయ లోకసమతా పార్టీ నాయకుడు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

సిపి రాధాకృష్ణన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. కోయంబత్తూర్ నుండి గెలుపొందారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు.

కిరెన్ రిజిజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

క్రిషన్ పాల్ గుజర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. ఫరీదాబాద్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు.

సంజీవ్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. ముజఫర్ నగర్ (యూపి) నుండి గెలుపొందారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.

వాసవ మన్సూక్ భాయ్ ధనాజీ భాయ్- కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. బారుచ్ (గుజరాత్) నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

రావ్ సాహెబ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు.

విష్ణుదేవ్ సాయి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాయగఢ్ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

సుదర్శన్ భగత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. లోహర్ దగ నుండి గెలుపొందారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+