'మేకిన్ ఇండియా అంటున్న మోడీ 10లక్షల సూట్ బ్రిటన్‌లో తయారీ'

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌లో తయారీ నినాదంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు. మేకిన్ ఇండియా తన స్వప్నమని చెబుతున్న ప్రధాని మోడీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ధరించిన రూ.10 లక్షల ఖరీదైన సూటు మాత్రం బ్రిటన్‌లో తయారీ అయిందని ఎద్దేవా చేశారు.

మోడీ కేవలం నలుగురైదుగురు పారిశ్రామికవేత్తల కోసం పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ మురికికూపంగా ఉందని, పరిశుభ్రం చేయాలని చెబుతున్న మోడీ.. ఉద్యోగం ఇవ్వకుండా, బాధలు తీర్చకుండా చేతికి చీపురు ఇస్తున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా మండిపడ్డారు. పలువురు ఏఏపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందని విమర్శించారు.

Modi’s Rs 10 lakh suit was made in UK: Rahul Gandhi

స్వచ్ఛ భారత్‌ పేరిట ప్రజల చేతిలో చీపురు పెట్టి, మోడీ పారిశ్రామికవేత్తల సేవలో తరిస్తున్నారన్నారు. కలల బేహారులు పంచరంగుల స్వప్నాలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.

ఢిల్లీ శివారుల్లోని భలాస్వా గ్రామంలో రాహుల్‌ 4 కిలోమీటర్ల రోడ్డుషో.. అనంతరం ఆయన ప్రసంగం ఇందిరాగాంధీని తలపించేలా ఉందని స్థానికులు నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. కాగా, తాను జయంతి నటరాజన్‌కి కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమని, పర్యావరణాన్ని రక్షించాలని పేదలు, గిరిజనుల హక్కులు కాపాడాలని మాత్రమే నేను ఆమెకు సూచించానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+