బాధపడట్లేదు: మోడీ ప్రధాని అవుతారన్న ఒకప్పటి భార్య

Narendra Modi
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్షి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన ఆయన ఒకప్పటి భార్య యశోదా బెన్ స్పందించారు. తాను మోడీకి వీరాభిమానిని అని, ఆయన తనను భార్యగా గుర్తించకపోయినా తాను ఏమీ బాధపడటం లేదన్నారు.

మామూలుగా మీడియాకు దూరంగా ఉండే ఆమె శనివారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడు మోడీతో పెళ్లి అయిందని, మూడేళ్లపాటు తాము కలిసి ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత తమ మధ్య మాటలు లేవని, ఎప్పుడూ కలుసుకోలేదని చెప్పారు. ఇలా జరగడం తన విధి రాతగా పేర్కొన్నారు.

ఆయన గురించి చదివేందుకు, వినేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు. ఆయన ప్రధాని అవుతారని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు.

మోడీ ఒక లక్ష్యంతో పని చేస్తున్నారని, ఆయన ఎప్పటికైనా ప్రధాని అవుతారని ఆమె వ్యాఖ్యానించారు. యశోద ఒక స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేసి ప్రస్తుతం రిటైరయ్యారు. కాగా తన వైవాహిక జీవితం గురించి అడిగే ప్రశ్నలకు మోడీ దూరంగా ఉంటారు. యశోదా బెన్‌ను ఆయన పెళ్లాడారని మీడియాలో అనేకసార్లు కథనాలు వచ్చినా మోడీ ఎప్పుడూ స్పందించలేదు.

కాగా, ఆర్ఎస్ఎస్‌లో పూర్తిస్థాయి కార్యకర్తలకు పెళ్లి ఒక అవరోధంగా ఉంటుందని భావించడం వల్లే ఆ విషయాన్ని మోడీ రహస్యంగా ఉంచినట్లు ఇటీవల ఆయన జీవిత చరిత్రను రచించిన నీలాంజన్ ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. కాగా, యశోదా బెన్ తన సోదరులతో కలిసి ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+