చెత్తను సొమ్ము చేసుకున్న మోదీ సర్కార్.. ఎన్నివేల కోట్లు సంపాదించిందంటే..!!
Scrap Income: మోదీ సర్కార్ ఆదాయ వనరులను అందించే ఏ మార్గాన్ని అస్సలు విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి వినూత్నంగా ఆదాయాన్ని సమీకరించింది.
వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా గడచిన మూడేళ్లలో రూ.2,364 కోట్లను మోదీ సర్కార్ ఆర్జించడంతోపాటు సమర్థతను ప్రదర్శించింది. దీనికోసం పరిశ్రమల ప్రోత్సాహం అంతర్గత వాణిజ్యం (DPIIT) శాఖ చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దీనికి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా పోస్ట్‌పై
మోదీ ప్రశంశించారు. సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రయత్నం గొప్ప ఫలితాలను సాధించిందన్నారు. ఇది పరిశుభ్రత, ఆర్థిక వివేకాన్ని ప్రోత్సహిస్తుందని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రత్యేక ప్రచారం 4.0 కింద ప్రారంభించబడిన ఈ కార్యక్రమం రాష్ట్ర ఖజానాకు గణనీయంగా దోహదపడటమే కాకుండా ప్రభుత్వ శాఖలలో పరిశుభ్రత, ఆర్థిక వివేకాన్ని ప్రోత్సహించింది. నవంబర్ 7న భౌతిక ఫైళ్లను తొలగించడానికి మరియు స్క్రాప్ చేసిన పదార్థాలను పారవేయడానికి DPIIT డ్రైవ్ 15,847 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేసి రూ.16,39,452 ఆదాయాన్ని ఆర్జించిందని వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్య ప్రభుత్వంలో పెండింగ్‌ను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 70 ప్రదేశాలలో DPIIT మొత్తం 300 క్లీనెస్ డ్రైవ్‌లను నిర్వహించింది.
Commendable!
— Narendra Modi (@narendramodi) November 10, 2024
By focussing on efficient management and proactive action, this effort has attained great results. It shows how collective efforts can lead to sustainable results, promoting both cleanliness and economic prudence. https://t.co/E2ullCiSGX
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) అనేది వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ. ఇది దేశ సామాజిక-ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా భారతదేశంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి విధానాలను అభివృద్ధితో పాటు అమలు చేస్తుంది. ఈ సంస్థ 1995లో స్థాపించబడినప్పటికీ ఆ తర్వాత 2000లో పారిశ్రామిక అభివృద్ధి శాఖతో విలీనం చేయబడింది.












Click it and Unblock the Notifications