వాట్ యన్ ఐడియా సర్‌జీ: పొలాల్లో దిష్టిబొమ్మల్లా మోడీ, అమిత్ షా కటౌట్లు
కొన్ని నెలల క్రితం కర్నాటకలో ఎలెక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్‌కు వెళ్లింది. ఆ రాష్ట్రంలో ఎటుచూసినా జాతీయనాయకులు, రాష్ట్ర నాయకుల భారీ కటౌట్లు కనిపించేవి. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అంతగా నాయకులపై తమ అభిమానాన్ని చాటుకున్నారు అక్కడి ప్రజలు. నాయకులు కూడా అంతే స్థాయిలో హామీలు గుప్పించారు. కటౌట్ల విషయానికొస్తే ఎక్కువగా కనిపించింది ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు యడ్యూరప్ప వే.
ఎన్నికలయ్యాయి మొత్తానికి బీజేపీ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్నాటకలో ఏర్పాటు అయ్యింది. హంగామా అంతా తగ్గినప్పటికి కూడా ఈ భారీ కటౌట్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. అయితే ఈ సారి ప్రధాన రహదారుల్లోనో లేక ఇతరత్ర బహిరంగ ప్రదేశాల్లోనో కాదు... పచ్చని పంట పొలాల మధ్య ఈ కటౌట్లు ప్రత్యక్షమవుతున్నాయి. అవును మీరు చదివింది నిజమే... హుబ్లీలోని పొలాల్లోనే దిష్టిబొమ్మల్లాగా అక్కడ రైతులు ఈ భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సారి కురిసిన భారీ వర్షాలకు తరికేరి రైతులు నాట్లు కూడా నాటేశారు. మొలకలెత్తుతున్న సమయంలో ఎవరి కళ్లైనా తమ పంటలపై పడి దిష్టి తగులుతుందేమోనని ఊహించిన రైతులు... దృష్టి మరల్చేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, యడ్యూరప్పల భారీ కటౌట్లను దిష్టి బొమ్మల్లాగా తమ పంటపొలాల్లో పెట్టారు. అయితే ఈ కటౌట్లకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు.

ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం ఈ భారీ కటౌట్లను రహదారులపై ఉంచారు.. ఇప్పుడు అవే కటౌట్లను పొంటపొలాల్లో ఉంచుతున్నారు అంతే తేడా అని చెబుతున్నారు రాజేష్ మాటపాటి అనే రైతు.
మొత్తానికి రైతులకు తట్టిన ఈ ఐడియాతో అటుగా వచ్చి పోయే వారి దృష్టి పంటపొలాలపైన కంటే కూడా దిష్టిబొమ్మలా పొలాల మధ్య నిటారుగా ఉన్న ఈ భారీ కటౌట్ల పైనే ఉంది. దీనిపైనే వారంతా చర్చించుకుంటున్నారు.
-
IPL మ్యాచ్‌లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications