కాంగ్రెస్ క్యాంపెయిన్‌లో మోడీ నినాదాలు.. ఊర్మిళకు ఎన్నికల షాక్.. ప్రచారానికి ప్యాకప్

Recommended Video

    Lok Sabha Election 2019 : ఊర్మిళ ఎన్నికల ప్రచారానికి ప్యాకప్ || Oneindia Telugu

    ముంబయి : లోక్‌సభ ఎన్నికల తొలి దశ అటుఇటుగా ప్రశాంతంగా ముగిసింది. ఇక సెకండ్ ఫేజ్ ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారపర్వం హీటెక్కిస్తూ అభ్యర్థులు రణరంగం తలపిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. అదలావుంటే ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఊర్మిళ మటోండ్కర్ కు చేదు అనుభవం మిగిలింది.

    బొరివాలి ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్న ఊర్మిళకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ప్రచారంలో ఒక్కసారిగా మోడీ నినాదాలు ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ ప్రచారంలో మోడీ నామస్మరణ ఏంటబ్బా అని అక్కడున్నవారు తేరుకునేలోపే విషయం అర్థమైంది. కొంతమంది యువకులు మోడీ మోడీ అంటూ బిగ్గరగా అరుస్తున్నారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

     modi slogans in congress candidate urmila matondkar campaign borivali mumbai

    ఆ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు సదరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అటు ఊర్మిళ కూడా ప్రచారానికి ప్యాక్ అప్ చెప్పేశారట. అనంతరం తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారట.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+