మీ కొడుకు కంటే బాగా చూస్తా: దేవేగౌడకు మోడీ చురక

చెన్నై/బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మాజీ ప్రధాని, జెడి(ఎస్) అధ్యక్షులు దేవేగౌడకు చురకలు అంటించారు. దేవెగౌడ తమ గుజరాత్ రాష్ట్రానికి వస్తే ఆయనకు అన్ని సౌకర్యాలూ కల్పించి, ఒక కొడుకులా సేవలు చేస్తానని మోడీ వ్యాఖ్యానించారు.

దేవేగౌడ మాజీ ప్రధాని అని, తాను వారి కుమారుడిలాంటి వాడిని అని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి గౌడ కర్ణాటకను వీడితే ఆయనకు గుజరాత్ స్వాగతం పలుకుతుందన్నారు. దేవేగౌడ వృద్ధాశ్రమంలో చేరుతానన్నా సరే లేదా ఫాంహౌస్‌లో ఉంటానన్నా ఓకే అభ్యంతరం లేదన్నారు.

Modi takes a jibe at Deve Gowda, says 'come to Gujarat, will serve you better than your son'

ఒక ఇల్లు తీసుకుని ఉంటానన్నా ఆయన ఇష్టమన్నారు. ఆయనకు నచ్చిన ఏర్పాట్లు చేస్తాని, లేదంటే తనతో ఉంటానన్నా ఇష్టమేనన్నారు. ఆయన కన్న కొడుకు కంటే తదాను బాగా చూసుకుంటానని, ఎలాగూ ఆయన తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోక తప్పదు గనుక తన ఆహ్వానాన్ని మన్నించాలని, ఆయనకు సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

కాగా, బిజెపికి 272 సీట్లు వచ్చి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కర్ణాటకలోనే ఉండనని దేవెగౌడ ఇటీవల వ్యాఖ్యానించారు. దానికి నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+