కొత్త పార్లమెంట్‌పై మోదీ అనూహ్యం - అది ‘ఆత్మనిర్భర్’‌లో భాగం, ‘న్యూ ఇండియా’ సంకేతమన్న పీఎంవో

దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవంతికి సంబంధించిన పనులు చేయొద్దని, శంకుస్థాపన కార్యక్రమం మాత్రం చేపట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ప్రక్రియలో మరో అడుగు పడింది. ముందు నుంచి అనుకున్న విధంగానే ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 10న (గురువారం) సంసద్ మార్గ్ లో కొత్త పార్లమెంట్ భవంతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అయితే దీనిపై మంగళవారం ప్రధాని కార్యాలయం ఓ అనూహ్య ప్రకటన చేసింది.

స్వాతంత్ర్యం తరువాత మొట్టమొదటి సారిగా భారత ప్రజలు తమ పార్లమెంటును నిర్మించుకునే అరుదైన అవకాశ ఇదేనని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. అంతేకాదు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆత్మ నిర్భర్ భారత్' నినాదాన్ని కొత్త పార్లమెంట్ భవంతికి సైతం జోడించేశారు.

modi-to-lay-foundation-of-new-parliament-on-10-th-vision-of-atmanirbhar-bharat-pmo

''ప్రధాని మోదీచే ఈనెల 10న శంకుస్థాపన జరుపుకోనున్న కొత్త పార్లమెంట్ భవనం.. 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'లో అంతర్భాగంగా ఉంటుంది. స్వాతంత్ర్యం తరువాత మొదటి సారిగా ప్రజల పార్లమెంట్ నిర్మితమవుతోన్న అరుదైన మైలురాయి ఇది. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుండగా, ఆ సమయానికి పూర్తికానున్న కొత్త పార్లమెంట్ భవంతి 'న్యూ ఇండియా'కు అవసరాలు, ఆకాంక్షలకు సరిపోయేదిగా ఉంటుంది''అని ప్రధాని కార్యాలయం మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్త పార్లమెంట్ భవంతి నిర్మాణాన్ని, పాత పార్లమెంట్ భవంతి లో చెట్ల నరికివేత, ఇతర పనులు చేపట్టరాదంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. కొత్తగా ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టకూడదని స్పష్టం చేసిన కోర్టు.. నూతన పార్లమెంట్​ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపనకు మాత్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. రూ.971 కోట్లతో నిర్మించనున్న కొత్త పార్లమెంట్ భవంతి పనుల కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది.

Recommended Video

    Ysrcp, TDP Took U-Turn On Agri Bills | నాడు అలా.. నేడు ఇలా.. | Bharat Bandh

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+