తుఫాను విషాదంపై చలించిన మోడీ: రాజ్‌నాథ్ వాకబు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్రలో హుధుద్ తుపాను మిగిల్చిన విషాదం గురించి తెలుసుకుని చలించిపోయారు. మంగళవారం ఉదయం పది గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్త్తున్నారు. విశాఖపట్నం చేరుకున్న వెంటనే ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఏరియల్‌ సర్వే చేస్తారు.

తుపాను పరిస్థితిని ఎప్పటికపడు తెలుసుకుంటున్నట్టు మోడీ వెల్లడించారు. తుపాను గురించి హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీలో ఉన్నతాధికారులు కూడా సమావేశమై తుపాను పరిస్థితిని సమీక్షించారు,

చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడుతుండగా హోం మంత్రి ఆయనకు ఫోన్‌ చేశారు. ఈ కష్టకాలంలో యుద్ధప్రాతిపదికన ఏయే చర్యలు తీసుకున్నదీ చంద్రబాబు నాయుడు వివరించారు. సహాయ చర్యల అమలు కోసం విశాఖపట్నంలోనే కలెక్టరేట్‌లో ఉంటామని ఆయన చెప్పారు.

Modi to visit cyclone hit areas of AP

సోమవారంనాడు రహదారులపై చేరిన చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో ఉన్నామని, యుద్ధ ప్రాతిపదికపై పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఈ రోజు వస్తే బాగుంటుందా, రేపు వస్తే బాగుంటుందా అని హోం మంత్రి వాకబు చేయగా, రేపు వస్తే బాగుంటుందని చంద్రబాబు చెప్పారు. ఐఎఎస్‌ అధికారులు, ఇతర సిబ్బందీ వేల సంఖ్యలో విశాఖపట్నం చేరుకుని సహాయ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారని రాజ్‌నాథ్‌కు చంద్రబాబు వివరించారు.

కాగా, చంద్రబాబు నాయుడు తుఫాను ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో పరిస్థితిని కూడా వివరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+