ఆధారాలున్నాయి: మోడీ పెళ్లిపై నగ్మా సంచలన వ్యాఖ్య
భోపాల్/న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పెళ్లి గురించి కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి నగ్మా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి నాటికి మోడీ మైనరే అన్న వార్తలు పచ్చి అబద్దాలని... ఆ సమయానికి మోడీ మేజరనడానికి ఆధారాలున్నాయన్నారు.
ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ పెళ్లిని ఇష్యూ చేయడం తప్పేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్లలో తన పెళ్లి విషయాన్ని ఆయన ఎందుకు దాచారో చెప్పాలన్నారు. మోడీ గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ఆయన భార్య జశోదా అత్యున్నతమైన వ్యక్తి అన్నారు.

అభూత కల్పన: షిండే
దేశంలో మోడీ వేవ్ ఉన్నదనేది కేవలం అభూత కల్పన మాత్రమేనని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.
క్షమాపణ చెప్పకపోవడం సిగ్గుచేటు: సింఘ్వీ
గోద్రా అల్లర్ల పైన మోడీ క్షమాపణలు చెప్పక పోవడం సిగ్గుచేటు విషయమని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన నేరాలు మాసిపోవన్నారు. హిట్లర్, ముసోలిని కూడా గెలిచారన్నారు.
మోడీ వేవ్ లేదు: జశ్వంత్
మోడీ వేవ్ ఎక్కడా కనిపించడం లేదని జశ్వంత్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications