మిత్రుడే.. కాదు: మోడీపై రజనీ భార్య, తమిళనాట చర్చ
చెన్నై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తన భర్త రజనీ, నరేంద్ర మోడీ భేటీ పైన పెదవి విప్పారు.
రజనీకి మోడీ కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, ఆయన తమ కుటుంబ సభ్యుడని ఆమె చెప్పారు. ప్రచార సభకు వెళ్లక ముందు ఆయన తమ ఇంటికి రావడం ఆయన సంస్కారం, ఆయన తమ కుటుంబ సభ్యుడని చెప్పారు. ఇప్పుడు లత చేసిన వ్యాఖ్యలు కూడా తమిళనాట రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి.

మోడీ - రజనీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

మోడీ - రజనీ
అంతకుముందు... రజనీకాంత్‌ను మోడీ కలుస్తారని వార్తలు వచ్చాయి. దానికి తోడు.. రజనీకాంత్ బిజెపికి మద్దతు పలుకుతారనే ప్రచారం సాగింది.

మోడీ - రజనీ
అయితే మోడీ, రజనీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. చెన్నైలో పోలింగ్ సమయంలో... రజనీ మాట్లాడుతూ తన మద్దతు ఎవరికి లేదన్నారు. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు.

మోడీ - రజనీ
ఇప్పుడు... తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తన భర్త రజనీ, నరేంద్ర మోడీ భేటీ పైన పెదవి విప్పారు.

మోడీ - రజనీ
రజనీకి మోడీ కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, ఆయన తమ కుటుంబ సభ్యుడని ఆమె చెప్పారు. ప్రచార సభకు వెళ్లక ముందు ఆయన తమ ఇంటికి రావడం ఆయన సంస్కారం, ఆయన తమ కుటుంబ సభ్యుడని చెప్పారు. ఇప్పుడు లత చేసిన వ్యాఖ్యలు కూడా తమిళనాట రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి.

Click it and Unblock the Notifications