రాజధానిలో అవి నిషేధం

Modi's swearing-in ceremony: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. దేశ రాజధానిలో చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతోండటం వరుసగా మూడోసారి.

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నికైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో ఆయన ఎన్నికయ్యారు. రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి ఆయన పేరును ప్రతిపాదించగా.. మిగిలిన వారు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Modi s swearing-in ceremony Security tightened in Delhi

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది బీజేపీ. తనకు మద్దతు ఇచ్చే సభ్యుల సంతకాలతో కూడిన లేఖను మోదీ.. రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరారు.

ఈ మేరకు- ఆదివారం ప్రమాణ స్వీకార సమయాన్ని నిర్ధారించారు. సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 7:15 నిమిషాలకు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేస్తారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

మోదీ ప్రమాణ స్వీకార నేపథ్యంలో- ఢిల్లీలో కనివినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌కు దారి తీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకుని రానున్నారు. పలు సమస్యాత్మక, సున్నిత ప్రదేశాల్లో అదనపు భద్రతను మోహరింపజేశారు. 3,000 మంది అదనపు పోలీసు సిబ్బందిని భద్రత విధుల్లోకి తీసుకున్నారు.

రాజధానిలో డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించారు. డ్రోన్లు, ఇతర అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌కు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. పారాగ్లైడర్స్, పారామోటార్స్, హ్యాంగ్ గ్లైడర్స్, మైక్రో ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్‌తో ఆపరేట్ చేయదగ్గ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, క్వాడ్‌కాప్టర్స్, పారాజంపింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను నిషేధం పరిధిలోకి తీసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+