పేరుకు ఐపిఎస్: దిమ్మదిరిగే ఆస్తులు, ఎంతో తెలుసా?

చండీగఢ్: భారతదేశ రాజకీయ నాయకుల ఆస్తుల గురించి మనం ఎక్కువగా చెప్పుకొంటాం. అయితే అప్పుడప్పడు అవినీతిపరులైన ప్రభుత్వ అధికారుల గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. అలాంటిదే ఇప్పుడు వెలుగు చూసింది.

ఒక జిల్లా ఎస్పీ అధికారికంగానే తనకు రూ. 152 కోట్లు ఆస్తి ఉందని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. పంజాబ్ లో ఇది జరిగింది. మొహాలి సీనియర్ ఎస్పీగా చాల కాలం నుంచి గుర్ ప్రీత్ సింగ్ భల్లర్ పని చేస్తున్నారు.

సీనియర్ ఎస్పీ గుర్ ప్రీత్ సింగ్ భల్లర్ తనకు రూ. 152 కోట్ల ఆస్తి ఉందనే విషయాన్ని ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసే ఐపీఎస్ అధికారుల ఆదాయ రిటర్నులల్లో పేర్కోన్నారు.

Mohali SSP Gurpreet Singh Bhullar is the richest IPS officer in Punjab

పంజాబ్ లో గత శాసన సభ ఎన్నికలలో పోటీ చేసిన కేవల్ థిల్లాన్ కు రూ. 137 కోట్లు, కరణ్ కౌర్ బ్రార్ కు రూ. 128 కోట్లు (ఇద్దరూ కాంగ్రెస్ నాయకులే) ఉన్నాయని అధికారికంగా చెప్పారు.

అయితే రాజకీయ నాయకుల తల తిరిగే విధంగా ఈ పోలీసు అధికారి తనకు 8 నివాస భవనాలు, నాలుగు వ్యవసాయ క్షేత్రాలు, మూడు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+