వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఉగ్రవాది నవెద్ బాల నేరస్తుడు అయితే ? (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లలను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన పాకిస్థాన్ ఉగ్రవాది నవెద్ మహమ్మద్ యాకూబ్ బాలుడా ? యువకుడా ? అని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అధికారులు ఆదారాలు సేకరిస్తున్నారు.

నేను ఇక్కడ మీ చేతిలో చచ్చేదానికి రాలేదు, మిమ్మల్ని చంపేదానికి వచ్చాను అని నవెద్ మహమ్మద్ పోలీసు అధికారులు, సైనికులకు చెప్పాడు. నవెద్ మహమ్మద్ అంత ధైర్యంగా పోలీసుల ముందు మాట్లాడటంతో ఎంతకరుడుకట్టిపోయాడు అని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పోలీసులకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురైయ్యింది. నవెద్ ఒక సారి తనకు 16 ఏళ్లు అని, ఒక సారి 20 ఏళ్లు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పోలీసు అధికారులకు మాత్రం ఇది పెద్ద సవాలుగా మారింది. అతనికి ఎంత వయస్సు అని కచ్చితంగా దృవీకరించిన తరువాత పూర్తి స్థాయి విచారణ చెయ్యడానికి చట్టం అంగీకరిస్తుంది.

8 సంవత్సరాలకే

8 సంవత్సరాలకే

8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే లష్కర్ ఉగ్రవాదులు పిల్లలకు ఉగ్ర శిక్షణ ఇస్తారు. వారికి 12 ఏళ్ల వచ్చే సరికి దాడులు చేయిస్తారు. బాల నేరస్తులను చట్టం ఏమి చెయ్యదని వారి ధైర్యం.

16 ఏళ్లు అయితే పంపిస్తారు

16 ఏళ్లు అయితే పంపిస్తారు

ఉగ్రవాద శిక్షణ పోందిన వారిని 16 ఏళ్లు వచ్చిన తరువాత కాశ్మీర్ పంపిస్తారు. సైనికులు, స్థానిక ప్రజల మీద దాడులు చేయిస్తారు. పట్టుబడితే బాలనేరస్తులు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

కుతూహలంతో పాక్

కుతూహలంతో పాక్

నవెద్ విషయంలో పాక్ కుతూహలంతో ఎదురుచూస్తున్నది. నవెద్ ను అరెస్టు చేసి జైలులో పెడుతారా, అతని వయస్సు ఏలా దృవీకరిస్తారు అని పాక్ వేచి చూస్తున్నది.

జైలుకు పంపించడం కుదరదు

జైలుకు పంపించడం కుదరదు

బాలనేరస్తులు అయితే వారిని జైలుకు పంపించి కఠినంగా శిక్షించడానికి అవకాశం లేదు. చట్టం ప్రకారం బాల నేరస్తులను రిమాండ్ హోంకు తరలించాలి. మూడు సంవత్సరాల పూర్తి అయితే విడుదల చెయ్యడానికి అవకాశం ఉంది.

చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు

చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు

ఉగ్రవాదులు, మాఫియా ముఠా నాయకులు, సంఘ వ్యతిరేక శక్తులు ఎక్కువగా బాలల దగ్గరే నేరాలు చేయించడానికి ఆసక్తి చూపిస్తారు. ఒక వేళ పోలీసులకు చిక్కితే చట్టం అడ్డుపెట్టుకుని తప్పించుకోవచ్చని వారు భావిస్తారని క్రిమినల్ న్యాయవాదులు అంటున్నారు.

నిర్బయ కేసు సాక్షం

నిర్బయ కేసు సాక్షం

భారతదేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మెడికల్ విద్యార్థిని నిర్బయ కేసులో ఇదే జరిగింది. 17 సంవత్సరాల కామాంధుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతనికి కఠిన శిక్షపడలేదు. రిమాండ్ హోంలో హాయిగా పెయింటింగ్స్ వేసుకుంటు కాలం గడిపాడు.

English summary
Mohammad Naved has been arrested for his role in the Udhampur attack in which India lost two brave soldiers. Ironically his age is a factor that is being debated over and over again with some even trying to suggest that the provisions of the Juvenile Justice Act be made applicable. If Mohammad Naved proves that he is juvenile, what happens?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X