హృదయ విదారకరం: ఐసీయూలో బెడ్ లేక తల్లి, టాయ్‌లెట్‌లో కుళ్లి నానమ్మ మృతి, విషాదంలో...
మహారాష్ట్రలో దారుణం జరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. ఓ కుటుంబాన్ని వైరస్ విచ్చిన్నం చేసింది. తల్లికి ఐసీయూలో బెడ్ దొరకక చనిపోగా, నానమ్మ ఆస్పత్రి టాయ్‌లెట్‌లో విగతజీవిగా కనిపించింది. ఓకే ఇంట్లో ఇద్దరూ చనిపోవడం విషాదం నింపింది.

ఇద్దరు మృతితో..
జల్గావ్ జిల్లాలో హర్షల్ నెహతా ఫ్యామిలీ ఉంటోంది. ఇతను ఉపాధి కోసం పుణెలో ఉంటున్నారు. ఇతని భార్య మరో నెలరోజుల్లో డెలివరీ కాబోతుంది. తండ్రి తులసీరాం కరోనా వైరస్ సోకి.. నాసిక్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అయితే హర్షల్ తల్లి టీనా, నానమ్మ మాలతీకి కూడా వైరస్ సోకింది. దీంతో వారిద్దరూ కూడా చనిపోయారు. కానీ వారిద్దరూ మృతి మాత్రం.. హృదయ విదారకరంగా జరిగింది. వైరస్ సోకడంతో టీనాను జల్గావ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఐసీయూలో బెడ్ లేకపోవడంతో దాదాపు ఆరు గంటలపాటు నిరీక్షించారు. చివరికి ఆమె చనిపోయారు.

కుళ్లిపోయిన మృతదేహం
తల్లి చనిపోయిందన్న బాధ్యతో హర్షల్ మెహతా ఫ్యామిలీ ఉన్న సమయంలో.. అదే ఆస్పత్రిలో ఓ కుళ్లిపోయిన శవం కనిపించింది. అదీ మాలతీగా గుర్తించారు. ఆస్పత్రి టాయ్‌లెట్ గదిలో మాలతీ అచేతనంగా కనిపించారు. బుధవారం రోజున టాయ్‌లెట్ క్యుబికల్ ఓపెన్ చేయడంతో మృతదేహం కనిపించింది. కానీ ఆమె అందులో ఎలా పడిపోయారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ నెల 2వ తేదీన వృద్దురాలు ఆస్పత్రికి వచ్చారని.. ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరమని చెప్పామని సిబ్బంది చెబుతున్నారు. కానీ వెళ్లిపోయిన మాలతీ మాత్రం టాయ్ లెట్ గదిలో పడిపోయి.. ఊపిరాడక చనిపోయారు.

8 రోజుల నుంచి
ఎనిమిది రోజుల నుంచి ఎవరూ తీయలేదు. దీంతో కంపు కొట్టడంతో ఇతర రోగులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ఓపెన్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు స్పందించారు. డీన్ ఖైర్ సహా ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సంజయ్ ముఖర్జీ అధికారులను ఆదేశించారు. మాలతీ కంటే ముందు మరో ముగ్గురు కూడా ఇలానే చనిపోయారని తెలుస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications