మోనికా రేప్, హత్య: 8గంటలపాటు నరకం చూపాడు!
పనాజీ: గోవాకు చెందిన ప్రముఖ పెర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా ఘర్డే హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెను హత్య చేసే ముందు హంతకుడు ఆమెను 8గంటలపాటు నరకం చూపించాడట. అక్టోబర్ 6న తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ఆమె హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
మోనికా హత్య కేసు: పోర్న్ వీడియోలు చూపించి కసితీరా రేప్ చేశాడు
కాగా, మూడు రోజుల క్రితం మోనికా ఏటీఎంలను వాడటంతో హంతకుడు రాజ్ కుమార్ సింగ్‌ను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. వారి విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది.

హంతకుడు రాజ్ కుమార్ సింగ్ అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఘర్డే ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించాడు. దీంతో ఆమె ఇరుగుపొరుగు వారి సాయం కోరుతూ గట్టిగా కేకలు వేసింది. ఆమె నోరు నొక్కేసిన నిందితుడు.. ఆమెను కత్తితో బెదిరింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసిన నిందితుడు.. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు చెప్పారు.
అంతేగాక, మోనికా శరీరం మీద చాలా చోట్ల అతడి పంటిగాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పరీక్షించేందుకు గోవా దంత వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. కాగా, మోనికా ఘర్డే శరీరంపైన ఉన్న పంటి గాట్లతో అతడి పళ్ల సైజు కూడా సరిపోయినట్లు తేలింది. నిందితుడు రాజ్ కుమార్ సింగ్‌పై ఐపీసీ 376, 392 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్లు సాలిగోవా ఇన్‌స్పెక్టర్ రాజేష్ వివరించారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications