బస్సు స్టీరింగ్‌పై కోతి: ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగా డ్రైవర్ సస్పెన్షన్ (వీడియో)

దావణగెరె: కర్ణాటకలోని దావణగెరెలో ఓ బస్సు డ్రైవర్ ఓ కోతి కారణంగా ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. కర్ణాటక ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్‌కు చెందిన బస్సు డ్రైవర్ బస్సును నడుపుతుండగా ఓ కోతి స్టీరింగ్ పైన కూర్చొని ఉంది. డ్రైవర్ అలాగే బస్సును నడిపాడు.

ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అతనిని సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం నాడు అధికారులు ప్రకటించారు. డ్రైవర్ దానిని పక్కకు తొలగించకుండా అలాగే ప్రమాదకరంగా బస్సును నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దావణగెరె డిపో బస్సును ఒకటో తేదీన డ్రైవర్‌ ప్రకాష్‌ ప్రయాణికుల కోసం సిద్ధం చేశాడు. దావణగెరె నుంచి చిత్రదుర్గ జిల్లా ఆలికల్లు గ్రామానికి బయలుదేరారు. ఆ వాహనంలోకి కోతి జొరపడింది. అది డ్రైవర్‌ వద్దకు వెళ్లి స్టీరింగ్‌పై కూర్చుంది. అయినా డ్రైవర్‌ బస్సును అలానే నడిపించాడు.

Monkey driver in Karnataka takes control of KSRTC bus, onlookers stunned

ఆ సమయంలో ఏదైనా సంభవించి ఉంటే బస్సులోని అనేక మంది ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకునేవారనే ఆందోళన వ్యక్తమైంది. ఈ సంఘటనపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు. ఆ సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణీకులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+